Lawrence Bishnoi: మహారాష్ట్ర మాజీ మంత్రిగా పనిచేసిన బాబా సిద్ధిఖి హత్య తర్వాత లారెన్స్ బిష్ణోయ్ పేరు పైకి వచ్చింది. 31 సంవత్సరాల ఈ పంజాబీ నేరస్థుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. మొదటి సోదరుడు అన్మోల్ కెనడా కేంద్రంగా ముఠాను నడిపిస్తున్నాడు. నేరమయ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు.. ఇది ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. లారెన్స్ బిష్ణోయ్ పంజాబ్లో పుట్టాడు. ఇతడిది దత్తరన్ వ్యాలీ.లారెన్స్ బిష్ణోయ్ పూర్వికులు సంపన్నులు వీరు రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటారు. లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్ వరకు చదివాడు. ఆ తర్వాత పంజాబ్ యూనివర్సిటీ పరిధిలోని డిఏవి కాలేజీలో అడ్మిషన్ పొందాడు. లారెన్స్ బిష్ణోయ్ జాతీయస్థాయిలో అథ్లెట్. పంజాబ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేశాడు. అదే సమయంలో న్యాయవిద్యను అభ్యసించాడు. అనంతరం విద్యార్థి రాజకీయాలలో చురుకుగా ఉన్నాడు. ఇదే సమయంలో గోల్డ్ బ్రార్ తో అతడికి పరిచయం ఏర్పడింది. అనంతరం అతడు అసాంఘిక కార్యకలాపాల వైపు ఆకర్షితుడయ్యాడు. వాటికి విద్యార్థి రాజకీయాలను ముసుగుగా వాడుకున్నాడు. డి ఏ వి కాలేజీలో విద్యార్థి సంఘాల మధ్య నెలకొన్న వివాదం తీవ్ర రూపు దాల్చింది . ఈ సమయంలో ప్రత్యర్థి సంఘం నాయకులు లారెన్స్ బిష్ణోయ్ ప్రియురాలని సజీవ దహనం చేశారు. ఆ ఘటన లారెన్స్ బిష్ణోయ్ ని నేరాల వైపు వెళ్లేలా చేసింది.
సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర
లారెన్స్ బిష్ణోయ్ కి ప్రధాన అనుచరుడిగా సంపత్ నెహ్ర ఉండేవాడు. అతనితో కలిసి 2018లో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హత్యకు లారెన్స్ బిష్ణోయ్ కుట్ర పన్నాడు. లారెన్స్ బిష్ణోయ్ ముఠాలో పేరుపొందిన గన్ షూటర్లు ఉన్నారు. వీరికి పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లో నెట్వర్క్ ఉంది. లారెన్స్ బిష్ణోయ్ నేరాలకు పాల్పడిన నేపథ్యంలో.. అతనిని చంపడానికి అనేకమంది గ్యాంగ్ స్టర్లు సిద్ధంగా ఉన్నారు. అందువల్ల అతడిని కోర్టుకు తరలించడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ సబర్మతి జైల్లో శిక్ష అనుభవిస్తున్నప్పటికీ.. తన నేరమయ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. సోదరుడు అన్మోల్, గోల్డి బ్రార్ లారెన్స్ బిష్ణోయ్ నేరమయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.
ఇలా.. నేరమయ ప్రపంచంలోకి వచ్చాడు
పంజాబ్లో సహజంగానే నేరమయ ముఠాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ముఠాల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ గొడవల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ జాబితాలో లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు జస్విందర్ ను జైపాల్ భుల్లర్ నాయకుడు నేరమయ ముఠా నాయకుడు హత్య చేశాడు. కాంగ్రెస్ నాయకుడు సిద్దు మూసే వాలా హత్యకు కూడా ఇలాంటి ముఠాలు చేసుకున్న దాడులే కారణం . జస్విందర్ ఒకప్పుడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లో పనిచేశాడు. భరత్పూర్ ప్రాంతంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ విస్తరించడానికి జస్వీందర్ పనిచేశాడు. అయితే విక్కీ మిదు ఖేడా మరణానికి ప్రతీకారంగా సిద్దు మూసేవాలా ను లారెన్స్ అనుచరులు కాల్చి చంపినట్టు తెలుస్తోంది..లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆయుధాల అక్రమ రవాణా, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు చెబుతున్నారు.
అప్పుడే సల్మాన్ ఖాన్ ను బెదిరించారు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 1998లో కృష్ణ జింకలను వేటాడినట్టు ఆరోపణలు వినిపించాయి. ఇప్పటికీ ఆ ఘటన సంబంధించి ఆయనపై కేసు కొనసాగుతోంది. కృష్ణ జింకలను లారెన్స్ బిష్ణోయ్ వర్గం వారు పరమ పవిత్రంగా భావిస్తారు. అయితే వాటిని సల్మాన్ ఖాన్ వేటాడటం లారెన్స్ బిష్ణోయ్ వర్గీయులకు నచ్చడం లేదు. 2018 నుంచి సల్మాన్ ఖాన్ ను వారు టార్గెట్ గా చేసుకున్నారు. 2024 ఏప్రిల్ లో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపారు. అంతకుముందు అతడి వ్యవసాయ క్షేత్రం వద్ద నిర్వహించారు. అదే సల్మాన్ ఖాన్ ను మట్టు పెట్టడానికి దాదాపు 25 మందిని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
సిద్ధం చేసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Shocking facts about gangster lawrence bishnoi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com