Oppo find X10 Pro Max: ఒప్పో కంపెనీకి మనదేశంలో స్థిరమైన మార్కెట్ ఉంది. అయితే దీనిని మరింత విస్తృతం చేసుకోవడానికి ఆ కంపెనీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రీమియం సెగ్మెంట్ మీద కన్నువేసింది. మారిన పరిస్థితులకు అనుగుణంగా.. కస్టమర్లకు ప్రీమియం ఫోన్లు అందించడానికి రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చి.. oppo find X10 Pro Max మోడల్ ను మార్కెట్లోకి ప్రవేశ పెట్టబోతోంది.
ఈనెల 22 నుంచి..
ఒప్పో కంపెనీ మాతృదేశం చైనా. ఈ కొత్త మోడల్ ఫోన్ ను చైనాలో ఈనెల 22న అధికారికంగా విడుదల చేయబోతోంది. మనదేశంలో అక్టోబర్ చివరి నాటికి ఇది విడుదల అయ్యే అవకాశం ఉంది.. ఈ ఫోన్ కు సంబంధించి కొన్ని కీలకమైన ఫీచర్లు లీక్ అయ్యాయి. ఆ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
ప్రాసెసర్
మీడియా టెక్ సరికొత్త 2 ఎన్ ఎం టెక్నాలజీ ఆధారంగా Dimencity 9600 Pro చిప్ సెట్ ను ఇందులో పొందుపరిచింది. ఇలాంటి టెక్నాలజీతో వస్తున్న మొట్టమొదటి ఫోన్ ఇదే.
డిస్ ప్లే
ఇందులో 6.89 ఇంచుల 2k LTPO OLED screen, 120 Hz/ 165 Hz రీ ఫ్రెష్ రేట్ లభిస్తుంది.
కెమెరా
ఫోన్ వెనుక భాగంలో త్రిబుల్ కెమెరా సెట్ అప్ ఉంది. 200 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా+ 200 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్+ 200 మెగా పిక్సెల్ టెలిఫోటో ఇందులో వస్తున్నాయి. ముఖ్యంగా హ్యాసల్ బ్లాడ్ అనే బ్రాండింగ్ ఇది వస్తోంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 50 మెగాపిక్సల్ కెమెరా ఇందులో ఉంది.
బ్యాటరీ, చార్జింగ్
ఊహించిన విధంగా ఇందులో అత్యంత బాహుబలి పరిమాణం లాంటి 8000 ఎం ఏ హెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. దీనికి తోడు 80 W వైర్డ్, 50 W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
మెమొరీ
12gb లేదా 16gb RAM, 256 జిబి/ 512 జీబీ స్టోరేజీలలో ఈ ఫోన్ లభిస్తుంది.
ఆపరేటింగ్ సిస్టం
ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్ ఓఎస్ 17 పై ఇది నడుస్తుంది.
మనదేశంలో ధర ఎలా ఉందంటే..
మనదేశంలో ఈ ప్రీమియం ఫోన్ ధర 1,29,990 లభిస్తుంది. అయితే దీని అధికారిక విడుదల ఇంకా తెలియదు కాబట్టి. ధర ఇంతవరకు స్థిరంగా నిర్ణయించలేదు. బ్యాంక్ ఆఫర్లు.. ఇతర డిస్కౌంట్లు కలుపుకుంటే కస్టమర్లకు ధర తగ్గే అవకాశం ఉంది.