OM Movie: ధనుష్ హీరోగా నటించిన ‘ఓం’ మూవీ పై యూత్ ఆడియన్స్ లో ఎలాంటి అంచనాలు ఏర్పడ్డాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు , టీజర్, ట్రైలర్ లకు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో అంచనాలు మరింతగా పెరిగాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉండడంతో ఈసారి ధనుష్ కచ్చితంగా కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నాడు అనే అంచనాల నడుమ నేడు భారీ లెవెల్ లో విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ ని అలరించిందా లేదా? అనేది ఇప్పుడు వివరంగా ఈ రివ్యూ లో చూద్దాం.
డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియ సామీ ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తీర్చిద్దిద్దాం లో గ్రాండ్ సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. ట్రైలర్ లో చూపించినట్టు ఇది కేవలం యాక్షన్ సన్నివేశాలు ఉన్న సినిమా మాత్రమేనని అనుకుంటే పెద్ద పొరపాటే. సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు, అద్భుతమైన ఎమోషనల్ సన్నివేశాలను కూడా పర్ఫెక్ట్ గా మిక్స్ చేయడంలో డైరెక్టర్ డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు. ధనుష్ ఫ్యాన్స్ కి మూవీ లవర్స్ కి థియేటర్స్ లో గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి విడుదలకు ముందే ఆడియన్స్ లో ఈ స్థాయి హైప్ క్రియేట్ అవ్వడానికి గల ప్రధాన కారణం సాయి అభయంకర్ అందించిన మ్యూజిక్. ఆయన అందించిన ప్రతీ సాంగ్ అద్భుతంగా క్లిక్ అయ్యింది. సినిమాలో కూడా ఈ పాటలు బాగా క్లిక్ అయ్యాయి.
ముఖ్యంగా ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి థియేటర్స్ లో ఆడియన్స్ కి గూస్ బంప్స్ వచ్చాయి. అభిమానులు పెట్టుకున్న అంచనాలను అధిగమించడం లో మ్యూజిక్ డైరెక్టర్ గా సాయి అభయంకర్ సక్సెస్ అయ్యాడు. ఇక ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించిన మలయాళం మెగాస్టార్ మమ్మూటీ కూడా ఎప్పటిలాగానే అదరగొట్టేసాడు. ఆయన పాత్రలోని వేరియేషన్స్ ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లేలా చేశాయి. ఇక సాయి పల్లవి తన కెరీర్ లో ఇప్పటి వరకు చెయ్యని క్యారెక్టర్ చేసింది. స్క్రీన్ మీద కనిపించినంతసేపు చాలా పవర్ ఫుల్ గా అనిపించింది. ఇక సినిమాలో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలను సాగదీసినట్టు గా అనిపిస్తాయి, అదొక్కటే ఈ సినిమాకు మైనస్ అని చెప్పొచ్చు. అంతే కాకుండా కథ కూడా రొటీన్ గానే ఉంటుంది. కానీ డైరెక్టర్ ట్రీట్ చేసిన విధానం మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఈమధ్య కాలం లో విడుదలైన ది బెస్ట్ కమర్షియల్ సినిమాల్లో ఇదొకటని చెప్పొచ్చు. ఈ చిత్రానికి మా ఓకే తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5..ఈ సినిమా పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.