Tollywood Hit Formula: బింబిసార, సీతారామం.. ఒక మోస్తరు బడ్జెట్ తో నిర్మితమై శుక్రవారం విడుదలయిన సినిమాలు. ఇవి రెండు కూడా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతున్నాయి. చాలాకాలం తర్వాత బుక్ మై షో లో 97% ఆక్యుపెన్సితో టికెట్లు తెగుతున్నాయి. వచ్చిన సినిమాలు వచ్చినట్టే వెళ్తున్న ఈ తరుణంలో ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఎందుకు ధియేటర్ వైపు రప్పిస్తున్నాయి? ప్రేక్షకులు థియేటర్ వైపు రావడం లేదు. వారు ఓటీటీలకు అలవాటు పడ్డారు? అనే విమర్శలు చేస్తున్న దర్శకులు, నిర్మాతలు దీనికి ఏం సమాధానం చెప్తారు?
ప్రేక్షకుడు వినోదం మాత్రమే కోరుకుంటాడు
త్రిబుల్ ఆర్, విక్రమ్, కేజీఎఫ్ -2, మేజర్, వరుణ్ డాక్టర్, డాన్, విక్రాంత్ రోణా.. ఈ సినిమాలు మాత్రమే నిర్మాతలకు లాభాలు పండించాయి. వీటిలో త్రిబుల్ ఆర్, మేజర్ తప్ప మిగతావన్నీ కూడా అనువాద సినిమాలే. అయితే వీటిల్లో ఉన్నది తెలుగు సినిమాల్లో లేనిది ఏంటంటే.. ముఖ్యంగా కథ, కట్టిపడేసే కథనం, సన్నివేశాల కూర్పు..ఇవి లేకపోవడం వల్లే తెలుగు సినిమాలు వరుసగా తన్నేస్తున్నాయి. చిరంజీవి, రామ్ చరణ్ ఆచార్య, రవితేజ ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, రామ్ ది వారియర్, మహేష్ బాబు సర్కారు వారి పాట, నానీ అంటే సుందరానికీ, రాణా విరాట పర్వం, నాగ చైతన్య థాంక్యూ, గోపీచంద్ పక్కా కమర్షియల్.. ఇలా పేరొందిన హీరోల సినిమాలే కాకుండా ఎంతో బజ్ క్రియేట్ చేసిన సినిమాలు కూడా పరాజయాన్ని మూట కట్టుకున్నాయి. వాస్తవానికి ఈ సినిమాల మీద నిర్మాతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ప్రేక్షకులు కోరుకున్న వినోదం ఈ సినిమాల్లో లేకపోవడంతో ఫ్లాఫులు అయ్యాయి.
Also Read: Bimbisara Collections: ‘బింబిసార’ 2nd డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ రిపోర్ట్స్ చూస్తే ఆశ్చర్యపోతారు
మితిమీరిన హీరోయిజం
తెలుగు సినిమాల్లో మితిమీరిన హీరోయిజం వల్లే పరాజయం పాలవుతున్నాయి. లాజిక్ లేని సీన్లు, కేవలం పాటలకు, పడకగది సన్నివేశాలకు మాత్రమే పనికి వచ్చే హీరోయిన్లు, అర్థంపర్థం లేని పాటలు, ఏమాత్రం ఆసక్తి కలిగించని సన్నివేశాలతో సినిమా అంటేనే ప్రేక్షకుడికి విసుగు వచ్చేసింది. అందుకే థియేటర్ల వైపు ప్రేక్షకులు వెళ్ళడమే మానేశారు. థియేటర్ల యాజమాన్యాలు టికెట్లు నుంచి మొదలు పెడితే వాహనాల పార్కింగ్ వరకు అడ్డగోలుగా దోచుకుంటుండటంతో ఆ ధరలకు భయపడి ప్రేక్షకులు సినిమాలకు వెళ్ళటం లేదు. ఏకంగా దిల్ రాజు లాంటి నిర్మాతలు తక్కువ ధరకే సినిమాకు వెళ్లొచ్చు అని ప్రకటనలు చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఆయన బ్యానర్ లో విడుదలయిన ఎఫ్3 సినిమాకి కూడా ఇలాంటి ప్రకటన చేశారు కాబట్టే స్వల్ప నష్టాలతో బయటపడ్డారు. ఇదే తరుణంలో తమిళం నుంచి ఈ సంవత్సరం మంచి అనువాద చిత్రాలు విడుదలయ్యాయి.. అందులో విక్రమ్ సినిమాకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వరుణ్ డాక్టర్, డాన్ వంటి సినిమాలను ఆదరించారు. ఇక కన్నడ నుంచి అనువాదం అయిన కేజీఎఫ్ _2 ను అయితే ఎక్కడికో తీసుకెళ్లారు. విక్రాంత్ రోణాకు కూడా జై కొట్టారు.
నిర్మాతల ఇష్టారాజ్యం
భారీ బడ్జెట్ సినిమాలకు టిక్కెట్ ధరలను పెంచుకునే వెసలు బాటు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడంతో నిర్మాతలు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. థియేటర్ దోపిడిని అరికట్టడంలో అటు ప్రభుత్వం ఇటు నిర్మాతలు విఫలం అవుతుండటంతో ప్రేక్షకులు ఒకింత నిర్వేదానికి గురవుతున్నారు. ఇది అంతిమంగా వసూళ్లపై ప్రభావం చూపిస్తోంది. క్షేత్రస్థాయిలో ఇన్ని సమస్యలు పెట్టుకుని అ ప్రేక్షకుడి పైన నిందలు వేయటం తెలుగు నిర్మాతలకు, దర్శకులకు, నటీనటులకు పరిపాటిగా మారింది. అయితే బింబిసార, సీతారామం సినిమాలు హిట్ అవడంతో ఈ ఆనందాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. “థియేటర్లకు ప్రేక్షకులు రావడంలేదని అనే బదులు వాళ్లకు నచ్చేలా సినిమాలు తీస్తే కచ్చితంగా వస్తారని ఈ సినిమాలు నిరూపించాయి” అని ట్వీట్ చేశారు. అంటే తెలుగు సినిమాల్లో నవ్యత, నాణ్యత లేదని ఒప్పుకున్నట్టే కదా!
Also Read:Dimple Hayathi: ‘ఖిలాడీ’ హీరోయిన్ హాట్ వీడియో వైరల్
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Tollywood hit formula its not the audiences fault but the film makers fantastic weekend for tollywood with bimbisara and sita ramam
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com