Vidamuyarchi movie : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో అజిత్…ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి…మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న ‘విడాముయర్చి’ మూవీ సంక్రాంతి కానుక గా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ ప్రేక్షకులందరిని ఆకట్టుకోగా ఇప్పుడు ‘సవదీక ‘ అనే లిరికల్ సాంగ్ అయితే వచ్చింది. మరి ఇప్పుడు ఈ సాంగ్ కూడా ప్రేక్షకుల ఆదరణను పొందుతూ ముందుకు సాగుతుంది. ఇక ఈ సినిమాకి ఇండియాలో ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించడం విశేషం… మరి ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలుస్తూ ఉండడం వల్ల ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధించబోతుందనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. అజిత్ ఇంతకు ముందు కూడా కొన్ని సినిమాలు చేసినప్పటికి అవి పెద్దగా సక్సెస్ సాధించలేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయనకు పెద్దగా సక్సెస్ లు రావడం లేదు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకొని తన స్టామినా ఏంటో చూపించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి ఎలాగైనా సరే అజిత్ కెరియర్ లో ది బెస్ట్ సినిమాగా నిలుస్తుంది అంటూ ఇప్పటికే ఈ సినిమా దర్శకుడు అయినా తిరుమేని చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు. మరి దర్శకుడు ఇంతకు ముందు చేసిన తడం సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఆయనకు దర్శకుడిగా మంచి గుర్తింపైతే వచ్చింది…
ఇక ఈ సినిమాని తెలుగులో రామ్ రెడ్ పేరుతో రీమేక్ చేసి ఇక్కడ కూడా మంచి విజయాన్ని సాధించాడు. మరి ఏది ఏమైనా కూడా మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకోవడం అలాగే ఆయన కంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు.
కాబట్టి ఆయనతో సినిమా చేయడానికి అజిత్ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. మరి అజిత్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆయనకి ఎలాంటి సక్సెస్ ని అందిస్తాడనేది తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అజిత్ త్రిషల కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయిందని సినిమా యూనిట్ నుంచి వార్తలైతే వస్తున్నాయి.