strawberries : స్ట్రాబెర్రీ ని చాలా మంది ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. రుచితో పాటు అనేక ప్రయోజనకరమైన పోషకాలు ఇందులో ఉంటాయి అంటున్నారు పోషకాహార నిపుణులు. అన్ని కాలాల్లోనూ సమృద్ధిగా లభిస్తుంది స్ట్రాబెర్రీ. ఇది సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఆరోగ్యంతో పాటుగా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇవి మాత్రమే కాదు మరెన్నో ప్రయోజనాలను కూడా అందిస్తాయి స్ట్రాబెర్రీలు. వాటి గురించి తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ ను చదివేసేయండి.
స్ట్రాబెర్రీ తినడం వల్ల బరువు తగ్గుతారు అంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే పీచు ఆకలిని తగ్గించడంలో సహాయం చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలోని విటమిన్ సి కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. ఈ స్ట్రాబెర్రీ లోని విటమిన్లు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా నివారిస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక ఇందులోని పీచు పదార్థం శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. తద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్లు కూడా మెండుగానే ఉంటాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఒక వరం ఈ పండు. షుగర్‌ని నియంత్రిస్తుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయం చేస్తుంది. శరీరం నుంచి మలినాలను తొలగిస్తుంది. బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. స్ట్రాబెర్రీలను క్రమం తప్పకుండా తింటే రక్తపోటు, గుండె ఆరోగ్యం, స్ట్రోక్ వంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ఇక గర్భిణీ స్త్రీలకు మంచి పండు.
స్ట్రాబెర్రీలతో ఫేస్ ప్యాక్ కూడా తయారు చేసుకోవచ్చు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడి, వాపు నుంచి రక్షిస్తాయి. స్ట్రాబెర్రీలు క్యాన్సర్, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించడంలో కూడా సహాయం చేస్తాయి. స్ట్రాబెర్రీ జ్యూస్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. నల్లటి వలయాలు, మచ్చలను తొలగించడంలో కూడా తోడ్పడుతుంది.
స్ట్రాబెర్రీలో విటమిన్ సి, కేలరీలు, ఫైబర్, పొటాషియం, ఫైబర్ కంటెంట్, ఖనిజాలు, విటమిన్లు సమృద్దిగా లభిస్తాయి. అలాగే ఇది వృద్ధాప్య ఛాయలు రానివ్వదు. చాలా ఆలస్యంగా వచ్చేలా చేస్తుంది. ఇక దీర్ఘకాలం యవ్వనంగా కనిపిస్తారు.. స్ట్రాబెర్రీ లో షుగర్ శాతం తక్కువగా ఉంటుంది. దీంతో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలాంటి టెన్షన్ లేకుండా తినవచ్చు. ఇక ఈ స్ట్రాబెర్రీస్‌తో జ్ఞాపక శక్తి పెరుగుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
స్ట్రాబెర్రీలను మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇందులో పాలిఫైనల్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థతో పాటు మీ శరీర పనితీరు మెరుగుపరచడంలో సహాయం చేస్తాయి. బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. దీంతో మంచి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.