Plant : మనీ ప్లాంట్ అంటే చాలా మందికి ఇష్టం. దీన్ని ప్రతి ఒక్కరు ఇంట్లో పెంచుకోవాలి అనుకుంటారు. ఈ ప్లాంట్ ఇంటిని అందంగా మార్చడంలో చాలా ఉపయోగపడుతుంది. ఈ మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్క ఇంటి దగ్గర ఉంటే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి అని నమ్ముతారు. ఇంట్లో డబ్బుకు ఏ లోటూ ఉండదు కూడా. అందుకే ఈ మొక్క ఆకులు ఎండిపోకుండా చూసుకుంటారు చాలా మంది. ఇలా జరిగితే చెడుకు సంకేతంగా భావిస్తారు. ఇదంతా మతపరంగా కానీ శాస్త్రీయంగా కూడా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. కానీ ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఇతర ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు నిపుణులు. మరి అవేంటో కూడా తెలుసుకోండి.
మనీ ప్లాంట్ సహజంగా గాలిని శుద్ధి చేస్తుంది. ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ మనీ ప్లాంట్ నాటితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. మనీ ప్లాంట్ చుట్టుపక్కల ఉన్న గాలిని సహజంగా శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. ఈ మనీ ప్లాంట్ ను పెంచడం పెద్ద కష్టం కూడా కాదు. ఈ ఇండోర్ మొక్కలు చుట్టుపక్కలన్న వాతావరణం నుంచి కలుషితాలను తొలగించడంలో చాలా సహాయపడతాయి. మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా తోడ్పడతాయి. అంతేకాదు ఇది రాత్రిపూట మనకు ఆక్సిజన్ ను అందిస్తుంది.
బిజీ లైఫ్ లో చాలా మంది ఒత్తిడికి, ఆందోళనకు గురి అవుతారు. అయితే వీటిని సహజంగా తగ్గించుకోవాలి. దీనికి మీ ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను ఉంటే సరిపోతుంది. ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ దగ్గర కాసేపు ఉన్నా, వాటితో మాట్లాడినా ఒత్తిడి తగ్గుతుంది. మరీ ముఖ్యంగా మనీప్లాంట్ ను అలాగే ఐదు నిమిషాల పాటు చూసినా సరే ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు ఆందోళన కూడా తగ్గుతుంది.
ఎలాంటి ఆధారాలు లేకున్నా కూడా మనీ ప్లాంట్ యాంటీ రేడియేటర్ లాగా పనిచేస్తుందని నమ్ముతారు చాలా మంది. మన చుట్టూ ప్రమాదకరమైన రేడియేషన్ ఉంటుంది. అంటే వై-ఫై, కంప్యూటర్, టీవీ లేదా మొబైల్ ఫోన్; అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల చాలా ప్రమాదకరం. ఇవి రేడియేషన్ విడుదల చేస్తుంటాయి. కుదిరితే మీ ఎలక్ట్రానిక్ పరికరాల చుట్టూ మనీ ప్లాంట్ ను పెట్టండి. దాని నుంచి వెలువడే తరంగాల మీ వరకు రాకుండా ఉంటాయి. ఈ మొక్క వాటిని గ్రహించడంలో సహాయం చేస్తుంది.
కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి కూడా ఈ మొక్క చాలా ఉపయోగపడుతుంది. ఇంట్లో వై-ఫై రూటర్ ఉంటే దాని దగ్గర కూడా మీరు మనీ ప్లాంట్ ను నాటండి. ఇలా చేయడం వల్ల మీ పిల్లలు అనారోగ్యానికి గురికారు. అలాగే పెద్దవారిలో ఒత్తిడి, తలనొప్పి సమస్యలు కూడా తగ్గుతాయి అంటున్నారు నిపుణులు. మనీ ప్లాంట్ మనస్సును శాంతపరుస్తుంది. ఈ ప్లాంట్ వల్ల రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతారు. మనీ ప్లాంట్ సహజంగా గాలిని శుద్ధి చేస్తుంది కాబట్టి ఇది కుటుంబ సభ్యులందరి ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది అంటున్నారు నిపుణులు.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Are there so many benefits of money plant plant immediately
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com