Cave of Death : ఇది వరకటి రోజుల్లో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే న్యూస్ పేపర్ చదివితేనే తెలిసేది. ప్రస్తుతం మనమున్న ఈ ఫాస్ట్ జనరేషన్ లో న్యూస్ పేపర్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. క్షణంలోనే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా వైరల్ అయిపోతుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచ నలుమూలల ఎక్కడ ఏం జరిగినా కూడా దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సెకండ్లలో వైరల్ అయిపోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కామన్ గా కనిపిస్తుంది. స్మార్ట్ ఫోన్ లేని వారు అంటూ ఎవరూ లేరని చెప్పడంలో సందేహం లేదు. మనం కూర్చున్న చోటే మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తో ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో క్షణాల్లో తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఒక మృత్యుగృహ కు సంబంధించిన ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది.కేఫ్ ఆఫ్ డెత్ అనే ఈ మృతి గృహ దక్షిణ అమెరికాలోని కోస్టారికాలో ఉంది. ఈ గుహలో కాలు మోపితే కాటికే అని పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ గృహ అంత డేంజర్ అని అందరూ చెప్తున్నారు. ఒక వ్యక్తి గతంలో ఈ గృహ సమీపంలోకి వెళ్లాడంట. ఆ వ్యక్తి అలా వెళ్లిన కేవలం రెండు మూడు నిమిషాల్లోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడంట. ఈ క్రమంలోనే కేఫ్ ఆఫ్ డెత్ అని పిలవబడే ఈ మృత్యు గృహ గురించి అనేక కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ గుహలోకి వెళ్లిన అనేక చిన్న చిన్న జీవులు అప్పటికప్పుడే క్షణాల్లో చనిపోతున్నారని గుర్తించడం జరిగింది.
కేవ్ ఆఫ్ డెత్ గృహ గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్న క్రమంలో కోస్టారికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్లి పరిశోధనలు చేపట్టారు. అది చాలా చిన్నపాటి గృహా అయినప్పటికీ దాని నుంచి అత్యంత తీవ్ర స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుందని ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గృహకు సమీపంలో అగ్నిపర్వతం ఉండడం వలన భూమి పొరల్లో నుంచి పగుళ్ల ద్వారా ఈ గృహలోకి కార్బన్ డయాక్సైడ్ లీక్ అవుతున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గృహలోకి భూమి పొరల్లో నుంచి గంటకు ఏకంగా 30 కిలోల కార్బన్ డయాక్సైడ్ వస్తున్నట్లు తేల్చారు.
సాధారణ గాలి కంటే కార్బన్ డయాక్సైడ్ బరువుగా ఉంటుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. అధిక మొత్తం లో కార్బన్ డయాక్సైడ్ జీవ ప్రాణులకూ చాలా ప్రమాదం అన్న సంగతి అందరికి తెలిసిందే. జీవ ప్రాణులు ఆక్సిజన్ ను పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తాయి. కేఫ్ ఆఫ్ డెత్ గృహాల్లో ప్రవేశించినప్పుడు అక్కడ అధిక మొత్తం లో కార్బన్ డయాక్సైడ్ ఉండడం వలన ఊపిరి ఆడకుండా కొద్దీ నిమిషాల్లోనే చిన్న చిన్న జంతువులూ అని చనిపోతున్నాయి అని తెలుస్తుంది.