Pregnancy Tips : ఈ మధ్యకాలంలో చాలా మంది సంతానలేమి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల కొందరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. పిల్లలు అంటే చాలా మందికి ఇష్టం. తప్పకుండా పిల్లలను కనాలని చాలా మంది కోరుకుంటారు. అమ్మ అని పిలిపించుకోవాలని అమ్మాయిలకు ఎలా ఉంటుందో.. నాన్న అని పిలిపించుకోవాలని పురుషులకు కూడా ఉంటుంది. జీవనశైలి మారడం వల్ల చాలా మంది ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. దీనికి తోడు పిల్లలు పుట్టడం కూడా ఆలస్యం అవుతుంది. దీంతో తల్లిదండ్రులు తొందరగా ముసలివారు అవుతారు. పిల్లలు మాత్రం ఇంకా చిన్నగానే ఉంటారు. ఈ రోజుల్లో అయితే పురుషులు 40 ఏళ్లలో పెళ్లి చేసుకుంటున్నారు. ఆ తర్వాత పిల్లలు అంటే ఇక మీరే అర్థం చేసుకోవాలి. అసలు పురుషులు తండ్రి కావడానికి సరైన సమయం ఏది? ఏ వయస్సులో తండి అయితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
పురుషులు 30 ఏళ్ల వయస్సులో తండ్రి కావాలని నిపుణులు చెబుతున్నారు. ఈ వయస్సు కంటే ఆలస్యం అయితే పుట్టే పిల్లలు అనారోగ్య సమస్యలతో పుడతారని నిపుణులు చెబుతున్నారు. పురుషులు 25 నుంచి 28 వయస్సు మధ్యలో తండ్రి అయితే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా పుడతారట. లేటు వయస్సులో పిల్లలను కనడం వల్ల అది వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పురుషులకు వయస్సు పెరిగే కొలది వీర్య కణాల సంఖ్య, నాణ్యత కూడా పూర్తిగా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. 40 ఏళ్లు దాటిన తర్వాత పురుషులు తండ్రి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతే పిల్లలు పుట్టడం చాలా కష్టం. 40 ఏళ్ల తర్వాత తండ్రి అయితే వారికి పుట్టిన పిల్లలో ఆటిజం సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు కూడా కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే ఈ రోజుల్లో కొందరు తొందరగా పెళ్లి చేసుకుంటున్నారు. 25 ఏళ్ల లోపు పురుషులు తండ్రి అయితే మాత్రం తప్పకుండా వారికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తండ్రి అయ్యే విషయంలో మాత్రం పురుషులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. వయస్సు పెరిగే కొలది ఇది తగ్గిపోతుంది. 45 ఏళ్ల తర్వాత అయితే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు. 35 ఏళ్ల లోగా పిల్లలను తప్పకుండా కనాలని చెబుతున్నారు. ఈ రోజుల్లో పురుషులు ఎక్కువగా మద్యం, ధూమపానం వంటివి సేవిస్తున్నారు. వీటిని అధికంగా సేవించడం వల్ల కూడా పురుషులు సంతానోత్పత్తి సమస్యలతో ఇబ్బంది పడతారు. ఈ చెడు అలవాట్లకు బానిస అయితే పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మంచి డైట్ పాటించండం ఉత్తమం.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.