https://oktelugu.com/

Ravi Prakash : రవిప్రకాష్ పై ట్రోలింగ్.. కాళ్లు మొక్కిన ఆ వ్యక్తి ఎవరు? ఏంటా కథ.. వైరల్

ఒక వీడియో ట్విట్టర్లో లో తెగ సర్కులేట్ అవుతోంది. ఆ వీడియో ప్రకారం.. ఒక విలాసవంతమైన కారు పక్కన ఫార్మల్ డ్రెస్ వేసుకొని రవి ప్రకాష్ నిల్చుని ఉన్నాడు. అతడికి ఎదురుగా మరో వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఇద్దరి మధ్య కొద్దిసేపు చర్చ జరిగింది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఉన్నట్టుండి రవి ప్రకాష్ కాళ్ళ మీద పడ్డాడు. దానికి రవి ప్రకాష్ ఏమాత్రం చలించలేదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 8, 2024 3:37 pm
    Follow us on

    Ravi Prakash : భారత రాష్ట్ర సమితి.. భారతీయ జనతా పార్టీలో విలీనం కాబోతోంది.. తన యూట్యూబ్ ఛానల్ అయిన ఆర్ టీవీ లో ఇలా ప్రసారం చేశాడో లేదో.. వెంటనే టీవీ9 ఒకప్పటి వ్యవస్థాపకుడు, సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రకాష్ పై గులాబీ పార్టీ నాయకులు, అనుకూల జర్నలిస్టులు ఒక్కసారిగా అతని మీద పడిపోయారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ లలో రవి ప్రకాష్ పై ఎదురుదాడి మొదలుపెట్టారు. మరోవైపు భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఏకంగా లీగల్ నోటీసులు పంపిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించామని, రాష్ట్ర అభివృద్ధిలో పదేళ్లపాటు కొనసాగామని, ఇలాంటి విలీన వార్తలు ఎన్నో చూసామని, కానీ పదే పదే పెట్టిన ప్రసారం చేస్తే లీగల్ నోటీసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.. ఈ క్రమంలో కొంతమంది ఒక అడుగు ముందుకేసి రవి ప్రకాష్ గతంలో చేసిన పనులను తవ్వడం మొదలు పెడుతున్నారు. పాత వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రవి ప్రకాష్ ను కడిగిపారేస్తున్నారు.

    అయితే ఇందులో ఒక వీడియో ట్విట్టర్లో లో తెగ సర్కులేట్ అవుతోంది. ఆ వీడియో ప్రకారం.. ఒక విలాసవంతమైన కారు పక్కన ఫార్మల్ డ్రెస్ వేసుకొని రవి ప్రకాష్ నిల్చుని ఉన్నాడు. అతడికి ఎదురుగా మరో వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఇద్దరి మధ్య కొద్దిసేపు చర్చ జరిగింది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఉన్నట్టుండి రవి ప్రకాష్ కాళ్ళ మీద పడ్డాడు. దానికి రవి ప్రకాష్ ఏమాత్రం చలించలేదు. పైగా చేతిలో ఏదో కాగితం పెట్టుకున్నాడు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో రకరకాల చర్చలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్లు సరికొత్త వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు..

    ఇందులో Aditya Warangal (@Aadi18_3) అనే ఓ ట్విట్టర్ ఐడీ రవి ప్రకాష్ పాత వీడియో పోస్ట్ చేశారు.. అందులో “చరిత్ర గుర్తుకు ఉందా రవి ప్రకాష్.. కలిసి పనిచేసే ఎడిటర్ భార్యతో కలిసి ప****.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో.. ఆమెను రెండవ పెళ్లి చేసుకున్నావ్. ఆమెకు రెండవ మొగుడిగా మారావు. బ్రేకింగ్ వీడియో బయట పెట్టమంటావా.. రాత్రి 9 గంటలకు ఈ వార్తలు ప్రసారం చేయమంటావా” అని ఐడీ లో రాసుకొచ్చారు.. అయితే దీనిని భారత రాష్ట్ర సమితి నాయకులు తెగ సర్కులేట్ చేస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ అనుకూల నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.. మరోవైపు భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి విలీనం ఢిల్లీ ఎన్నికల తర్వాత జరుగుతుందని రవి ప్రకాష్ ఘంటపథంగా చెప్పాడు..

    ఇటీవలి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూటమి అధికారులకు వస్తుందని రవి ప్రకాష్ చెప్పాడు. తెలంగాణలో ఒక్క పార్లమెంటు స్థానాన్ని కూడా భారత రాష్ట్ర సమితి గెలుచుకోదని జోస్యం చెప్పాడు. అతను చెప్పినట్టుగానే ఇవి నిజమయ్యాయి. ఇప్పుడు బిజెపి, బీఆర్ఎస్ విలీనం కూడా నిజమై తీరుతుందని కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే భారత రాష్ట్ర సమితి మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని.. అవి పూర్తి నిరాధారమైనవని గులాబి పార్టీ నాయకులు అంటున్నారు. భారత రాష్ట్ర సమితి పై ఎవరు ఎన్ని రకాలుగా ప్రచారాలు చేసిన అవన్నీ ఉత్తి పుకార్లు గానే మిగిలిపోతాయని గులాబీ పార్టీ నాయకులు చెబుతున్నారు.