Homeటాప్ స్టోరీస్ration card cancellation : రేషన్ బియ్య తిని తీరాల్సిందే.. లేకుంటే మీ కార్డ్ రద్దు..

ration card cancellation : రేషన్ బియ్య తిని తీరాల్సిందే.. లేకుంటే మీ కార్డ్ రద్దు..

ration card cancellation : తెలంగాణలో రేషన్ కార్డుల కథ ‘పాతదానిని పారేసి, కొత్తదానిని తెచ్చుకోవడం’ లాగా తయారైంది. ప్రభుత్వం కొత్త కార్డులు ఇస్తామని ఊరిస్తోంది కానీ అంతకంటే ముందే పాత కార్డులను ‘శుద్ధి’ చేసే పనిలో పడింది. ఇకపై రేషన్ తీసుకోవడం అంటే కేవలం హక్కు కాదు.. అదొక నిబంధన! వరుసగా ఆరు నెలలు రేషన్ బియ్యం తీసుకోకపోతే.. మీ కార్డు అడ్రస్ గల్లంతయినట్టే.

బియ్యం తీసుకోకపోతే పాపమా?

ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుంటే జనాలు అవి తీసుకుని అమ్ముకుంటున్నారని కొందరు అధికారుల కంప్లైంట్. ఆ బియ్యం తీసుకుని తినకుండా పక్కదారి పట్టిస్తే, మీ కార్డుకు పక్కదారి పట్టించే అధికారం ప్రభుత్వానికి ఉందంటున్నారు.

ప్రభుత్వం దృష్టిలో రేషన్ తీసుకోకపోతే మీరు ‘అనర్హులు’. కార్డులను తగ్గించి, రేషన్ ఖర్చును తగ్గించుకోవడమే ఇందులో ఉన్న పెద్ద పారదర్శకత. పాతవారు బియ్యం తినడం మానేస్తే ఆ బియ్యం కొత్త వారికి పెట్టి, కొత్త కార్డులు ఇస్తారన్నమాట!

క్షేత్రస్థాయి రిపోర్టుల గోల

మండలాల వారీగా తహసీల్దార్లు రిపోర్టులు తయారు చేస్తున్నారు. ఆరు నెలలుగా బియ్యం లాగిన్ ఓపెన్ చేయని వారిని ‘టార్గెట్’ చేస్తున్నారు. “మాకు రేషన్ బియ్యం వద్దు, మా సొంత బియ్యమే నయం” అనుకునేవారికి ఇప్పుడు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది.

రేషన్ తీసుకోవడం అంటే కేవలం బియ్యం పొందడం కాదు, ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని తిని తీరాలనే నియమాన్ని పాటిస్తేనే మీ కార్డు బతుకుతుంది. లేకపోతే… కార్డు దేవుడా!

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Zomato Anniversary Campaign: బిల్డప్ కోసం లోగో తీసేస్తే.. కోట్లు బొక్క..

Zomato Anniversary Campaign: క్రియేటివిటీ.. ఇది ఆకర్షించే విధంగా ఉండాలి. జనాలలో ఆలోచన తెచ్చే విధంగా ఉండాలి. ఒకరకంగా నూతనత్వం వైపు అడుగులు వేసే విధంగా ఉండాలి. అలాకాకుండా చదివేస్తే ఉన్న...

Yashasvi Jaiswal: ఒక్క డిన్నర్.. ఈ క్రికెటర్ జీవితాన్ని ఎలా మార్చిందంటే..

Yashasvi Jaiswal: ఇప్పుడు మనం సోషల్ మీడియా కాలంలో ఉన్నాం. ఏదైనా జరిగితే చాలు.. దానికి తగ్గట్టుగా కథలు అల్లడం.. దానిని వ్యాప్తిలోకి తీసుకురావడం అలవాటుగా మారిపోయింది. సోషల్ మీడియా కాలంలో నిజాలకు విలువలేదు....

Jailer 2: రజినీకాంత్ ‘జైలర్ 2’ విషయంలో ఆ తప్పు జరగబోతుందిగా…

Jailer 2: రజనీకాంత్ హీరోగా నెల్సన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'జైలర్ 2' సినిమా అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జైలర్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. దాంతో జైలర్...

Hardik Pandya: హార్దిక్ చెప్పినట్టు.. సీఎస్కే మేనేజ్మెంట్ ఆడుతోంది.. ఏం జరుగుతుందో..

Hardik Pandya: గొప్ప ఆటగాడే. గతంలో గుజరాత్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. మరోసారి ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. కానీ ఆ తర్వాత మనోడి ఆట మారిపోయింది. బౌలింగ్ తన స్థాయిలో...

RHA Movement: దేశవ్యాప్తంగా మరో ఉద్యమం.. ఈసారి అదే లక్ష్యం!

RHA Movement: సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన కాక్రోచ్ వ్యాఖ్యల నుంచి పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మొన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా ఉద్యమించిన సీజీపీ నీటి...
Oktelugu Epaper
Exit mobile version