Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి రికార్డులకు మారుపేరు. ఆయన చిత్రాల రికార్డ్స్ ఆయన బ్రేక్ చేయాల్సిందే. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 రికార్డ్స్ కొన్ని ఇప్పటికీ అలానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి 2 ఉంది. 2001లో స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో రాజమౌళి ప్రస్థానం మొదలైంది. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో రాజమౌళి చేసింది 12 చిత్రాలు మాత్రమే. బాహుబలి, బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలకు ఆయన దాదాపు పదేళ్ల సమయం తీసుకున్నాడు.
ఆర్ ఆర్ ఆర్ మూవీతో రాజమౌళి ఆస్కార్ రేంజ్ కి వెళ్ళాడు. ఆ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది. ఇండియాస్ నెంబర్ వన్ దర్శకుడిగా ఉన్న రాజమౌళి పై డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే. ‘మోడరన్ మాస్టర్స్: రాజమౌళి’ పేరుతో ఈ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. రాజమౌళిని ఉద్దేశిస్తూ ప్రముఖులు చేసిన కామెంట్స్, ఆయన దర్శకత్వ ప్రస్థానం సాగిన తీరు ఆ డాక్యుమెంటరీలో చూపించారు.
ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి దేవుడిని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ ఒకింత వివాదాస్పదంగా ఉన్నాయి. అయితే రాజమౌళి దేవుడిని నమ్మరు అట. మోడరన్ మాస్టర్స్ డాక్యూమెంటరీలో ఆయన మాట్లాడుతూ… దేవుడిని నమ్మనివారు నీతి నిజాయితీతో ఉంటారు. అందుకే నా భార్యకు ప్రమాదం జరిగి చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు కూడా నేను దేవుడికి మొక్కలేదు, అన్నారు. కాగా ఒక సున్నితమైన అంశం మీద రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా ఉన్నాయి.
దేవుడిని నమ్మిన వాళ్ళు నీతి నిజాయితీతో ఉంటారు అనడం ద్వారా పరోక్షంగా దేవుడిని నమ్మేవారిని కించపరిచినట్లు అయ్యింది. అంటే దేవుడు ఉన్నాడని నమ్మేవారిలో నిజాయితీ ఉండదు అన్నట్లు రాజమౌళి కామెంట్స్ ఉన్నాయి. దేవుడిని నమ్మకపోవడం ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అంత మాత్రాన భగవంతుడిని పూజించేవారిని కించపరిచేలా మాట్లాడటం సరికాదన్న వాదన వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలో రాజమౌళి తన కామెంట్స్ పై స్పందిస్తారేమో చూడాలి.
ప్రస్తుతం రాజమౌళి తన నెక్స్ట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనిలో ఉన్నారు. ఎస్ఎస్ఎంబి 29 స్క్రిప్ట్ లాక్ చేసిన రాజమౌళి నటుల ఎంపిక, సాంకేతిక వర్గాన్ని సమకూర్చుకుంటున్నారు. రాజమౌళి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో వస్తున్న మొదటి చిత్రం ఇది. పాన్ వరల్డ్ మూవీగా రూపొందించనున్నారు. అందుకే యూనివర్సల్ సబ్జెక్టు ఎంచుకున్నారు.
హాలీవుడ్ సక్సెస్ఫుల్ సిరీస్ ఇండియానా జోన్స్ తరహాలో ఈ చిత్రం ఉంటుందట. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా మహేష్ బాబు కనిపిస్తాడట. ఎస్ఎస్ఎంబి 29 జంగిల్ అడ్వెంచర్ డ్రామా అని సమాచారం. రూ. 800 కోట్ల బడ్జెట్ కేటాయించారు. మహేష్ బాబు ఈ చిత్రం కోసం మూడేళ్లకు పైగా సమయం కేటాయించాల్సి ఉంది. మహేష్ బాబు ఈ చిత్రం కోసం మేకోవర్ అవుతున్నారు. ఆయన పెరిగిన జుట్టుతో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ యుద్ధ విద్యలు కూడా నేర్చుకోవాల్సి ఉంటుందట. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.