Bitthiri Sathi: భగవద్గీతతో పెట్టుకొని.. బిత్తిరిసత్తిపై కేసు ఓ గుణపాఠం..

బిత్తిరి సత్తి.. ఈ పేరు తెలియనివారు ఎవరూ ఉండరు.. ఓ న్యూస్‌ చానెల్‌లో ప్రసారమైన తీన్మార్‌ వార్తలతో వెలుగులోకి వచ్చిన బిత్తిరి సత్తి.. తర్వాత రెండు మూడు ఛానెళ్లలో కూడా పనిచేశారు. కొన్ని సినిమాల్లో నటించారు. యాంకరింగ్‌ చేశాడు.

Written By: Raj Shekar, Updated On : August 8, 2024 3:46 pm

Bitthiri Sathi

Follow us on

Bitthiri Sathi: బిత్తిరి సత్తి… అలియాస్‌ చేవేళ్ల రవి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారు ఉండరు. పలు న్యూస్‌ ఛానెళ్లలో పనిచేసిన ఆయన తనకంటూ ప్రత్యేగ గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణ యాసని.. తెలంగాణ భాషని మనందరికి అర్ధమయ్యేలా వార్తలు చెప్పడం.. నవ్వించడం.. అందరినీ కలుపుకుపోవడం బిత్తిరి సత్తి నైజం. మంచి న్యూస్‌ రీడర్, యాంకర్, యాక్టర్‌ కూడా. వీ6లో ప్రసారమయ్యే తీన్మార్‌ వార్తలతో వెలుగులోకి వచ్చాడు. తర్వాత టీవీ9, సాక్షి న్యూస్‌ ఛానెళ్లలోనూ పనిచేశారు. వీ6లో సావిత్రి, బిత్తిరి సత్తి కాంబినేషన్‌ బాగా సక్సెస్‌ అయింది. అయితే తర్వాత కాలంలో ఆ వార్తల రేటింగ్‌ తగ్గడంతో బిత్తిరి సత్తి బయటకు వచ్చేశారు. న్యూస్‌ రీడర్‌గా ఉన్నప్పుడే కొన్ని సినిమాల్లో నటించారు. తుపాకి రాముడు సినిమాలో హీరోగా కూడా చేశారు. కొన్ని సినిమా ఫంక్షన్లకు యాంకర్‌గా, గెస్ట్‌గా, వ్యవహరించారు. కొన్ని టీవీ ప్రోగ్రాంలలో కూడా పార్టిసిపేట్‌ చేశారు. ప్రస్తుతం సొంతంగా యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టుకుని ప్రోగ్రాంలు చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నాడు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీతను కించపరిచేలా బిత్తిరిసత్తి చేసిన వీడియో ఇప్పుడు కాంట్రవర్సీకి కారణమైంది. దీనిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. దీంతో ఆగ్రహించిన ఈ సంఘాలు బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రై మ్‌ లో ఫిర్యాదు చేశాయి. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

జీరో నుంచి హీరో వరకు..
బిత్తిరి సత్తి అలియార్‌ రవి మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. జీరో స్థాయి నుంచి హీరో వరకు ఎదిగాడు ఇందుకు ఎంతో కష్టపడ్డాడు. న్యూస్‌ రీడర్‌ నుంచి సినిమాలో హీరోగా కూడా చేశారు. అయితే.. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలంటారు. కానీ బిత్తిరి సత్తి.. తన సెలబ్రిటీ ఇమేజ్‌ను దుర్వినియోగం చేసి చాలాసార్లు కాంట్రవర్సీ అయ్యాడు. తాజాగా ఆయన చేసిన ఓ వీడియోలో భగవద్గీతను అనుకరిస్తూ.. తనదైన శైలిలో వ్యంగ్యంగా బిత్తిరి సత్తి చేసిన స్కిట్‌పై నెటిజన్స్‌ మండిపడుతున్నారు. అటు హిందూ సంఘాలు కూడా ఈ బిత్తిరి సత్తి చేసిన ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

అతి అనర్ధం..
ఎదైనా పరిమితి వరకు చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు.. తనను ఆదరిస్తున్నారు. తన వీడియోలు మెచ్చుకుంటున్నారు. లైక్‌లు, షేర్లు వస్తున్నాయని ఏది పడితే అది చేస్తే చూడరు. విషయం కూడా ఉండాలి. ఇందుకు తాజాగా బిత్తిరి సత్తి భగవద్గీతపై చేసిన వీడియోనే నిదర్శనం. తాను ఏం వీడియో చేసినా చూస్తారన్న భావనతో భగవద్గీతపైనే వీడియో చేశాడు. ఇతర మతాలపై గ్రంథాలు చేయడం మన దేశంలో పెద్ద నేరంగా భావిస్తారు. కానీ హిందువుల దేవుళ్లు, గ్రంథాలపై మాత్రం అనేక వ్యంగ్య వీడియోలు కామెంట్లు చేస్తున్నా స్పందించడం లేదు. ఇది మన హిందువుల దౌర్భాగ్యమే. ఇదే అదనుగా ఇప్పుడు బిత్తిరి సత్తి కూడా వీడియో చేశాడు. బిల్లు గీత అని దానికి పేరు పెట్టాడు. దీనిపై వానరసేన అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ఈ వీడియో హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని మండిపడుతున్నాయి. ఈ సందర్బంగా ప్రముఖ హిందూ సంఘం అయిన రాష్ట్రీయ వానరసేన వాళ్లు ఈ వీడియోపై బిత్తిరి సత్తికి అల్టీమేటం జారీ చేశారు. అంతేకాదు సోషల్‌ మీడియాలో వీడియోను తెగించి హిందూ సంఘాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈమేరకు హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా అతనిపై కేసు నమోదైంది.

ఇప్పుడు క్షమాపణ..
ఇదిలా ఉంటే.. బిత్తిరి సత్తి తన వీడియోలో భగవద్గీతను కించపరిచేలా లేవని సమర్ధించుకున్నాడు. హిందూ సంఘాలు తనపై ఎలాంటి కేసులు పెట్టిన ఎదుర్కోవడానికి సిద్దమని వాళ్లకు సవాల్‌ విసిరారు. కేసు నమోదు చేసిన 24 గంటల్లోనే సత్తి తన మనసు మార్చుకున్నాడు. ఇటీవల విడుదల చేసిన వీవియోలో హాస్యం పండించే క్రమంలో భగవద్గీతపై తప్పు దొర్లిందని అంగీకరించాడు. తాను భగవద్గీతను నమ్ముతానని, ఆరాధిస్తానని, పారాయణం చేయడానికి ప్రయత్నిస్తాననరి చెప్పాడు. ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యానించలేదని పేర్కొన్నారు. ఎవరిని అయినా నొప్పించి ఉంటే మన్నించాలని కోరాడు. ఈమేరకు ఎక్స్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు.