Parliament Elections 2024 : కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే,ఆ పార్టీ మాజీ నేత,రాజకీయ విశ్లేషకులు రాష్ట్రంలోని లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికలపై తన అంచనాలు.. విశ్లేషణలను వెలిబుచ్చారు. రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చనే అంశంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. మొత్తం 17 లోక్సభ స్థానాలను గాను బీజేపీ పక్కాగా 06 సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేశారు. కాంగ్రెస్ 05 సీట్లలో మంచి మెజారిటీతో విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక మరో ఐదు స్థానాల్లో బిజెపి..కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఉందన్నారు.
అందులో భువనగిరి, పాలమూరు,జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలో బిజెపి స్వల్ప ఆధిత్యతను ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. ఇక వరంగల్ లో కాంగ్రెస్ కు హెడ్జ్ ఉంటుందన్నారు. బిజెపి పక్కాగా గెలిచే స్థానాల్లో కరీంనగర్,నిజాంబాద్, సికింద్రాబాద్,మల్కాజిగిరి, చేవెళ్ల,ఆదిలాబాద్ ఉండనున్నట్లు వివరించారు. ఇక కాంగ్రెస్ మహబూబాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండలలో గెలుస్తుందన్నారు. హైదరాబాద్ లో మాత్రం ఎంఐఎం మరోసారి విజయం సాధిస్తుందన్నారు.
మెదక్ లో మాత్రం ఎవరు గెలిచినా ఒకటి లేదా రెండు శాతం ఓట్ల తేడానేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో బిజెపికి ఈ స్థాయి ఊపు రావడానికి మాత్రం మోడీ చరిష్మానే కారణమన్నారు గోనే.