https://oktelugu.com/

Tollywood Heroes : టైర్ టూ హీరోల్లో ముందంజ లో ఉన్న హీరోలు వీళ్లేనా..?

కాబట్టి టైర్ టు హీరోల్లో నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకోవాలంటే అది నాని వల్లే అవుతుందని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు...

Written By:
  • NARESH
  • , Updated On : May 20, 2024 / 10:01 PM IST

    Are these the heroes who are in the forefront of tier two Heroes..?

    Follow us on

    Tollywood Heroes : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలు కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. సీనియర్ హీరో లను మినహాయిస్తే ఈ ఆరుగురు స్టార్ హీరోలతోనే సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలనేవి రూపొందుతున్నాయనే విషయం మనలో చాలామందికి తెలియదు. నిజానికి స్టార్ హీరోలందరు భారీ బడ్జెట్ తో సినిమాలను చేస్తుంటే, యంగ్ హీరోలు మాత్రం లో బడ్జెట్ సినిమాలను చేస్తూనే మంచి సక్సెస్ లను అందుకుంటూ వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు.

    ఇక టైర్ టు హీరోలుగా గుర్తింపు పొందిన వీళ్ళందరూ మంచి సినిమాలని చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు కదులుతున్నారు. ఇక యంగ్ హీరోల్లో కూడా కాంపిటీషన్ అయితే విపరీతంగా పెరిగింది. టైర్ టు హీరోలలో ముందు వరుసలో ఉన్న హీరోలు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం… ముందుగా టైర్ టు హీరోల గురించి చూసుకుంటే విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, నితిన్, నాని లాంటి హీరోలు టైర్ టు హీరోల్లో మిగిలిన వాళ్ల కంటే ముందు వరుసలో ఉన్నారు. ఇక వీళ్ళ సినిమాలను ప్రేక్షకులు ఆదరించడామే కాకుండా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను కూడా సంపాదించుకుంటున్నాయి.

    మరి ఇలాంటి క్రమంలో వీళ్లలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండి ముందుకు సాగుతున్న హీరో మాత్రం నాని అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయనకు సక్సెస్ రేట్ అనేది ఇప్పటివరకు చాలా ఎక్కువగానే ఉంది. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ వరుసగా రెండు మూడు ఫ్లాప్ లతో ఢీలా పడ్డాడు. ఇక నితిన్ పరిస్థితి కూడా అలానే ఉంది. దాదాపు నాలుగు సంవత్సరాలు నుంచి ఆయనకు ఒక్క సక్సెస్ కూడా లేదు.

    రామ్ పోతినేని కూడా ‘ఇస్మార్ట్ శంకర్ ‘ సినిమా తర్వాత చేసిన రెండు సినిమాలు వరుసగా డిజాస్టర్లవ్వడంతో ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఇక ఉన్న దాంట్లో నాని నే వరుస గా మంచి విజయాలు అందుకుంటు ముందుకు దూసుకెళ్తున్నాడు. కాబట్టి టైర్ టు హీరోల్లో నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకోవాలంటే అది నాని వల్లే అవుతుందని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…