Regional Ring Road Hyderabad: విశ్వనగరం హైదరాబాద్‌లో రోజు రోజుకూ రద్దీ పెరుగుతోంది. హైదరాబాద్ మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు.. నగరం దాటడానికే గంటల సమయం పడుతోంది. ఈ సమస్య పరిష్కారానికే దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రింగ్‌రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఓఆర్‌ఆర్ పేరుతో ఈ రోజ్డు నిర్మాణం చేశారు. ఎక్స్‌ప్రెస్ హైవేగా ఉన్న ఈ రోడ్డు నిర్మాణంతో చాలా వరకు హైదరాబాద్ రోడ్లపై ఒత్తిడి తగ్గింది. భారీ వాహనాలు.. ఓఆర్‌ఆర్ మీదుగానే వెళ్తున్నాయి. ఇదిలా ఉంటే.. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఓఆర్‌ఆర్ అవతల మరో రింగ్‌రోడ్డు నిర్మాణానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈమేరు కేంద్రానికి సిఫారసు చేసింది. సుమారు 300 కిలోమీటర్ల పొడవైన ఈ రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు కేంద్రం కూడా ఆమోదం తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మాణానికి కేంద్రం ముందుకు వచ్చింది.
ఉత్తర, దక్షిణ అలైన్‌మెంట్ పూర్తి..
– కేంద్ర– రాష్ట్ర సంకుక్తంగా నిర్మించే రీజినల్ రింగ్‌రోడ్(ట్రిపుల్ ఆర్)కు సంబంధించి ఉత్తర, దక్షిణ బిభాగాలకు సబంధించిన అలైన్‌మెంట్ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలోనే ప్రతిపాదనలు రూపొందించారు. వీటిని కేంద్రానికి కూడా పపించారు. ఉత్తర భాగంలో భాగంగా సంగారెడ్డి ఎన్‌హెచ్ – 65 మీదుగా తూప్రాన్, గజ్వేల్, చౌటుప్పల్ ఎన్‌హెచ్ – 65 మీదుగా 158 కిలోమీటర్ల మేర అలైన్‌మెంట్ నిర్ధారించారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా పూర్తయింది. ఎక్కడా ఆరోపణలు రాలేదు. నిర్వాసితులే పరిహారం కోసం ఆందోళన చేశారు. అలైన్‌మెంట్‌పై మాత్రం ఎవరూ అభ్యంతరం తెలుపలేదు.
– ఇక దక్షిన భాగం అలైన్‌మెంట్‌కు సంబంధించిన ప్రాథమిక కసరత్తు కూడా బీఆర్‌ఎస్ హయంలోనే పూర్తయింది. తర్వాత ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోవడంతో ఇపుపడు దక్షిణ విభాగం అలైన్‌మెంట్ పూర్తి చేయాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై పడింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను దారి తప్పిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రాథమిక అలైన్‌మెంట్‌కు తుదిరూపి ఇచ్చి కేంద్రానికి పంపితే సరిపోయేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొంత మంది నేతలు 189 కిలోమీటర్ల దక్షిణ విభాగం అలైన్‌మెంట్ మారుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్‌హెచ్ – 65 మీదుగా చౌటుప్పల్ నుంచి షాద్‌నగర్–ఆమన్‌గల్ సమీపం నుంచి చేవెళ్ల మీదుగా సంగారెడ్డి వరకు రింగురోడ్డుకు కలపాలి. గత ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక అలైన్‌మెంట్ మ్యాపు ఇలాగే ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతల ఒత్తిడితో అలైన్‌మెంట్ మారింది. వారి ప్రయోజనం కోసం సుమారు 4 కిలోమీటర్ల అలైన్‌మెంట్ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రజలకు ఉపయోగపడాల్సిన ప్రాజెక్టులోనూ కాంగ్రెస్ నేతలు స్వప్రయోజనాలు వెతుక్కోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.