YCP: గూగుల్ టేక్ అవుట్ అనేది యూట్యూబ్, గూగుల్ మెయిల్ వంటి గూగగుల్ ఉత్పత్తులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉపయోగించే ఆర్కైవ్‌లోకి వాడే డేటాను ఎగుమతి చేయడానికి అనుమతించే సాంకేతిక పరిజ్ఞానం. ఇప్పుడు ఇదే పరిజ్ఞానం వైసీపీ నేతలను ఇబ్బంది పెడుతోంది. ఆ పార్టీకి రాజకీయ విరోధిలా మారింది. మాజీ జీఎం వైఎస్.జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్. అవినాష్‌రెడ్డి, అతని తండ్రికి వ్యతిరేకంగా సీబీఐ సాక్షాలను సేకరించేందుకు గూగుల్ టేక్ అవుట్‌ను ఉపయోగించింది. ఇప్పుడు ముంబై నటి జెత్వాని కేసులో ఫిబ్రవరి 2న విద్యాసాగర్‌తోపాటు విశాల్ గున్ని, ఇతర అధికారులు ముంబైలో ఉన్నారని వెల్లడించారు. ఐపీఎస్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ప్లాట్‌కు సంబంధించిన కీలకమైన డిజిటల్ ఆధారాలను దర్యాప్తు అధికారులు గూగుల్ టేక్ అవుట్ ద్వారా సేకరించారు.
తాడేపల్లి ప్యాలెస్‌లోనే ప్రణాళిక..
ప్రాధాన నిందితుడు అయిన విద్యాసాగర్ మొదట హైదరాబాద్ వెళ్లి.. అక్కడి నుంచి ముంబై చేరుకున్నట్లు గుర్తించారు. అయితే జత్వాని అరెస్టుకు సబంధించిన తాడేపల్లి ప్యాలెస్‌లోనే ప్రణాళిక రూపొందించినట్లు గుర్తించింది. దాని ప్రకారమే ఇంటిలిజెన్స్ విభాగం అధిపతికి జెత్వాని కదలికలు, నివాసం గురించి సమాచారం ఇచ్చి తీసుకురావాలని సూచించినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన డిజిటల్ ఆధారాలు సేకరించే పనిలో దర్యాప్తు అధికారులు ఉన్నారు.
వాట్సాప్ మెస్సేజ్‌లు, మెయిల్స్ పరిశీలన..
జత్వాని కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారులు, వైసీపీ నేతల మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్, ఈమెయిల్స్‌ను కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతనే ఈ కేసులో పోలీసులను నిందితులుగా చేర్చినట్లు సమాచారం. ప్రధాన నిందితుడు విద్యాసాగర్ పరారీలో ఉన్నందున అతనిపై లుక్‌అవుట్ నోటీజులు జారీ చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది.