Vetrimaaran And NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్న స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న దేవర సినిమాతో మరోసారి తను పాన్ ఇండియాలో తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాతో ఏకంగా వెయ్యికోట్ల కలెక్షన్స్ ను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టిగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే ప్రమోషన్స్ చేపట్టిన ఆయన ఇప్పుడు రీసెంట్ గా గత రాత్రి ఆయన చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అక్కడ మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను కూడా చెప్పాడు. ఇక అందులో భాగంగానే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకు నచ్చిన డైరెక్టర్ వెట్రీ మారన్ అని చెప్పాడు.
ఇక వీలైతే ఆయనతో సినిమా కూడా చేయడానికి రెడీగా ఉన్నానని ఓపెన్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆయన సినిమాలు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. కాబట్టి ఆ సినిమాలను కమర్షియల్ గా వర్క్ అవుట్ చేయాలంటే చాలా కష్టం. ఇక ఆ సినిమాలు కూడా తమిళ్ నేటివిటికి దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఆయన పాన్ ఇండియా సినిమాలను చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని.
మరి ఇలాంటి సందర్భంలో ఎన్టీయార్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయనతో సినిమా చేస్తే అది వర్కౌట్ అవుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి వెట్రిమారన్ సినిమాలో ఒక పీడిత ప్రాంతానికి సంబంధించిన జనాలు ఎలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కష్టాలను ఎలా తీర్చాలి అనే దాంట్లో నుంచి ఆ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి హైలెట్ అవుతూ ఉంటాడు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకి అలాంటి ఆర్ట్ సినిమాలు సెట్ అవ్వవు.
కాబట్టి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగానే ఉంటుంది. కానీ ఆ సినిమా కమర్షియల్ గా మాత్రం పెద్దగా వర్కౌట్ అవ్వదు. అలాగే ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమాగా కూడా రాకపోవచ్చు అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…