Sky Blue Mushroom: వాతావరణ కాలుష్యం.. గ్లోబల్ వార్మింగ్.. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల వల్ల బయోడైవర్సిటీ దెబ్బతింటున్నదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. గ్లోబల్ వార్మింగ్ వల్ల బయో డైవర్సిటీ మాత్రమే కాదు.. అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. అధిక వర్షపాతం, కరువు, విపరీతమైన ఎండలు, ముంచెత్తే వరదలు, దట్టంగా కురిసే మంచు.. ఇవన్నీ కూడా కొంతకాలంగా ప్రపంచ దేశాలను ఇబ్బంది పెడుతున్నాయి. దీనివల్ల కోట్లలో నష్టం వాటిల్లుతోంది. భారీగా ప్రాణ నష్టం కూడా చోటుచేసుకుంటున్నది.
Also Read: దట్టమైన అడవిలో గోకర్ణ గుహలో రష్యన్ మహిళ.. పోలీసులు చూసి షాక్.. ఏం జరిగిందంటే?
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒక సానుకూల వార్త శాస్త్రవేత్తల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కనకగిరి గుట్టలో అడవిలో కనిపించిన ఓ అద్భుతం శాస్త్రవేత్తలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని పెనుబల్లి – కల్లూరు- సత్తుపల్లి మండలాల మధ్య విస్తరించిన కనకగిరి గుట్టలోని అడవుల్లో ఇటీవల అధికారులకు ఒక అద్భుతం కనిపించింది. అది చూసేందుకు నీలిరంగులో ఉంది. దానిని ఏంటలోమా హోచెస్టెటెరీ జాతికి చెందిన నీలి ఆకాశ పుట్టగొడుగు అని అధికారులు చెబుతున్నారు. ఇంగ్లీష్ పరిభాషలో స్కైబ్లూ మాష్రూమ్ అని పిలుస్తున్నారు. పులిగుండాల ప్రాజెక్టు సమీపంలో ఉన్న పురాతన శివాలయం వెనుక దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ మాష్రూమ్ కనిపించిందని అధికారులు చెబుతున్నారు.
Also Read: పనికిరావని నారింజ తొక్కలను పడేశారు.. 25 ఏళ్ల తర్వాత వెళ్లి చూస్తే.. ఏం కనిపించిందంటే?
స్కై బ్లూ మాష్రూమ్ లో అరుదైన అజులిన్ వర్ణ ద్రవ్యం ఉంటుంది. వాతావరణంలో తేమ స్థాయి అధికంగా ఉన్నప్పుడు ఇది పెరుగుతుంటుంది. న్యూజిలాండ్ లోని దట్టమైన అడవుల్లో ఉన్న వాతావరణమే కనక గిరి అడవుల్లోనూ ఉండడంతో ఇక్కడ పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. న్యూజిలాండ్ దేశంలో 202 సంవత్సరంలో అక్కడి ప్రభుత్వం 50 డాలర్ల నోటును విడుదల చేసింది. ఈ నోటు మీద స్కై బ్లూ మాష్రూమ్ ను ఏర్పాటు చేసింది. శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం ఈ పుట్టగొడుగు ఒక సాబ్రోబిక్ శిలీంధ్రం. ఇది సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. అటవీ ప్రాంతంలో పోషక చక్రానికి దోహదం చేస్తుంది.. దీనిని పొరపాటున తింటే మాత్రం విషంగా మారుతుంది. జీవవైవిధ్యాన్ని కాపాడడంలో ఈ మాష్రూం తన వంతు పాత్రను పోషిస్తుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.