Dharmavaram Terror Case: ఏపీలో( Andhra Pradesh) మరోసారి ఉగ్ర నీడలు కనిపించాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులతో చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా 16 సెల్ ఫోన్ సిమ్ లు మార్చి ఉగ్రవాదులతో మాట్లాడినట్టు తేలింది. కొద్ది రోజుల కిందటే విజయనగరంలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువకముందే శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో ఐబి అధికారులు జరిపిన తనిఖీలు సంచలనం సృష్టించాయి. ఓ వ్యక్తి పాకిస్తాన్ కు ఫోన్లు చేస్తూ.. ఉగ్రవాదులతో చాటింగ్ చేస్తున్నాడని అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంట్లో సోదాలు చేసి కొన్ని అనుమానాస్పద వస్తువులు, 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. రాయచోటిలో కూడా ఉగ్రవాదులను అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం మరింత ఉత్కంఠ రేపుతోంది.
ALso Read: నిమిషప్రియకు ఉరిశిక్ష తప్పుతుందా? ప్రాణాలతో బయటపడగలుగుతుందా?
ఇంట్లో ఏకంగా 16 సిమ్ లు..
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం( Dharmavaram) కోట కాలనీలో నూర్ మహమ్మద్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతడు పాకిస్తాన్ కు ఫోన్లు చేస్తూ, ఉగ్రవాదులతో చాటింగ్ చేస్తున్నాడని సమాచారం. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నిందితుడు ధర్మవరం మార్కెట్ వీధిలో ఓటి దుకాణంలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా చర్చకు దారితీసింది. ఇప్పటికే నూర్ సోషల్ మీడియా ఖాతాలపై నిఘా పెట్టారు పోలీసులు. ఉగ్రవాదులతో అతడు సంబంధాలు పెట్టుకున్నాడా? అని లోతుగా విచారిస్తున్నారు. గత కొంతకాలంగా నూర్ కదలికలపై నిఘా ఉంచిన అధికారులు పక్కా సమాచారంతోనే అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ధర్మవరం ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Also Read: వివేకా హత్య కేసు.. జగన్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా..?
గత నెలలో రాయచోటిలో..
ఇప్పటికే రాయచోటిలో( Rayachoti ) అరెస్టులు జరిగిన సంగతి తెలిసిందే. గత నెలలో ఉగ్రవాదులను ఐబి తో పాటు ఎన్ఐఏ అరెస్టు చేసింది. తమిళనాడు బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి ఉగ్రవాదులు అబూబకర్ సిద్ధిఖి, మహమ్మద్ మన్సూర్ అలీని ఐబీ అధికారులు అరెస్టు చేశారు. అప్పట్లో జరిపిన సోదాల్లో పేలుడు పదార్థాలు, బకెట్ బాంబులు, సూట్ కేస్ బాంబులు దొరికినట్లు ప్రచారం నడిచింది. తమిళనాడులో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో వీరు చాలాకాలంగా నిందితులుగా ఉన్నారు. గత 30 సంవత్సరాలుగా రాయచోటిలో నివాసం ఉంటూ ఇలా ఉగ్రవాదులుగా మారారని పోలీసులు చెబుతున్నారు. ఉగ్రవాదులకు సైతం వీరు ఆశ్రయం కల్పించినట్లు పోలీసులు నిర్ధారిస్తూ కేసులు నమోదు చేశారు. అయితే అక్కడకు నెల రోజులకే ఇప్పుడు ధర్మవరంలో ఉగ్ర జాడలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. చూడాలి ఈ కేసు విషయంలో మరిన్ని ఆసక్తికర విషయాలు బయట పడతాయో..