Actor Director Conflicts: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకున్న నటులు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే కుట్ర హీరోలు సైతం తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యూచర్లో ఎలాగైనా సరే స్టార్ హీరోలుగా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికి దక్కనటువంటి క్రేజ్ ను సంపాదించుకొని పాన్ ఇండియాలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి నటులు సైతం ఇప్పుడు హాలీవుడ్ దర్శకులను నమ్మి భారీగా మోసపోయారు.
Also Read: ఏపీలో ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకం తొలిరోజు.. స్పందన ఎలా ఉందంటే?
‘అపూర్వ లాఖ్యా’ అనే దర్శకుడి తో రామ్ చరణ్ ‘జంజీర్’ అనే సినిమా చేషాడు. ఆ సినిమా భారీ డిజాస్టర్ అవ్వడంతో రామ్ చరణ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మరోసారి బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేసే సాహసమైతే చేయలేదు. ఇక ఓం రావత్ డైరెక్షన్లో ప్రభాస్ చేసిన ‘ఆదిపురుష్’ సినిమా డిజాస్టర్ అవ్వడమే కాకుండా విమర్శకుల నుంచి భారీ విమర్శలను కూడా ఎదుర్కొంది… ప్రభాస్ సైతం మరోసారి బాలీవుడ్ దర్శకుడు నమ్మే ప్రసక్తే లేదు అన్నట్టుగా తెలుగు దర్శకులతోనే సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక రీసెంట్ గా అయాన్ ముఖర్జీ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ఎన్టీఆర్ విషయంలో అదే తప్పు చేశాడు.
వార్ 2 సినిమాతో ఎన్టీఆర్ కి భారీ సక్సెస్ ని అందిస్తానని చెప్పిన అయాన్ ముఖర్జీ ఈ సినిమాతో ఏమాత్రం సత్తా చాటలేకపోయాడు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో నత్తింగ్ అనే చెప్పాలి. అసలు ఆయన క్యారెక్టర్ ఈ సినిమాలో ఎందుకు విలన్ గా నటించాడు.
ఆ విలనిజాన్ని ప్రదర్శించే ఒక్క సీన్ కూడా ఎలివేట్ కాకపోవడం, ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసి సన్నివేశాలు లేకపోవడం మొత్తానికైతే ఇలాంటి వాటి వల్ల ఈ సినిమా భారీ నష్టాన్ని మిగిల్చిందనే చెప్పాలి. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం ఇకమీదట బాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేసే ప్రసక్తే లేదు అనే రేంజ్ లో భీష్మించుకు కూర్చున్నట్టుగా తెలుస్తోంది…
Also Read: తెలుగు రాష్ట్రాల్లో ‘కూలీ’ ప్రభంజనం..2వ రోజు వచ్చిన వసూళ్లు ఎంతంటే!
ఇప్పటికే వరుసగా ఏడు సక్సెస్ లను అందుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎనిమిదో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటాడని అందరు భావించారు. కానీ తను మాత్రం ఎన్టీఆర్ కి ఒక ఫ్లాప్ సినిమాని కట్టబెట్టడనే చెప్పాలి…నిజానికి బాలీవుడ్ దర్శకులకు మన హీరోలను హ్యాండిల్ చేసే కెపాసిటీ లేదా లేదంటే మన హీరోల ఎదుగుదలను చూడలేక కావాలనే మన వాళ్ళకు ప్లాప్ లను కట్టబెడుతున్నారా? అనే ధోరణిలో కూడా కొన్ని అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి…