Gokarna Forest Mystery: కర్ణాటక రాష్ట్రంలో గోకర్ణ ప్రాంతం దట్టమైన అడవులకు ప్రసిద్ది. ఇక్కడ క్రూరమైన జంతువులు ఉంటాయి. చెట్లు కూడా విస్తారంగా ఉంటాయి. నేటి సాంకేతిక కాలంలోనూ ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ అంతంత మాత్రం గానే ఉంటాయి. అడవి లోపలికి వెళితే బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. పైగా అడవి కూడా అత్యంత దట్టంగా ఉంటుంది. అలాంటప్పుడు అక్కడ అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టంగా ఉంటుంది. దీనికి తోడు అక్కడ జంతువులు కూడా విపరీతంగా ఉంటాయి. అలాంటప్పుడు అక్కడికి వెళ్లాలని ఎవరూ అనుకోరు. ఉండాలని కూడా భావించరు. అటవీ అధికారుల సమక్షంలో సఫారీ కి వచ్చిన వారు కూడా ఆడవి లోపలికి వెళ్లరు. కేవలం వాహన మార్గంలో మాత్రమే వెళ్లి వస్తుంటారు.. అటవీ శాఖ అధికారులు కూడా బృందంగా ఉంటేనే అడవి లోపలికి వెళ్తారు. ఆ తర్వాత వెంటనే వచ్చేస్తుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సౌరశక్తి సహాయంతో నడుస్తుంటాయి. వాటి ద్వారానే అటవీశాఖ అధికారులు జంతువుల కదలికలను గమనిస్తుంటారు.
Also Read: Yangtze Sturgeon Fish: ఆ ఒక్క చేప కోసం 300 డ్యాములు కూల్చేసిన చైనా
దట్టమైన అడవికి ప్రసిద్ధి చెందిన గోకర్ణ ప్రాంతంలో ఇటీవల అటవీశాఖ అధికారులు రామతీర్థలో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ గుహలో ఓ రష్యన్ మహిళ తన పిల్లలతో కలిసి జీవించడాన్ని పోలీసులు గమనించారు. ఆ మహిళ పేరు నైనా కుటీనా.. వయసు 40 సంవత్సరాలు వరకు ఉంటుంది. మొదట్లో ఆమె క్రైస్తవ భావజాలాన్ని అనుసరించేది. ఆ తర్వాత భారతీయ ఆధ్యాత్మిక ఆకర్షితురాలు అయింది. బిజినెస్ వీసా మీద ఇండియాకు వచ్చింది. ఆ వీసా గడువు కూడా 2017లో ముగిసిపోయింది. అయినప్పటికీ ఆమె ఇక్కడే ఉంటున్నది. గుహలో తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నది. 2017లో వీసా గడువు పూర్తయినప్పటికీ ఆమె ఇక్కడే ఉండడం పట్ల అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.. కుటీనా అధికారులతో స్పష్టంగా మాట్లాడుతోంది. ఎందుకు గుహలో ఉంటున్నావంటే.. ధ్యానం చేస్తున్నానని చెప్పింది. పిల్లలతో పాటు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావని అడిగితే దానికి సమాధానం చెప్పలేదు. మీకు కావాల్సిన ఆహారాన్ని.. ఇతర పదార్థాలను ఎవరు తెచ్చి ఇస్తున్నారు అని పోలీసులు అడిగితే.. దానికి ఆమె సమాధానం చెప్పలేదు.
పూర్వకాలంలో యోగులు.. మునులు ధ్యానంలోనే ఉండేవారు. ధ్యానంలోనే వారు సంవత్సరాల పాటు ఉండేవారు. ఈ సమయంలో ఆకలిని మర్చిపోయారు. నిద్రను విస్మరించేవారు. కేవలం శ్వాస మీద మాత్రమే మనసును లగ్నం చేయడం ద్వారా సంవత్సరాల తరబడి ధ్యానం చేస్తూ ఉండేవారు. అయితే ఈ రష్యన్ మహిళ కూడా అలానే ధ్యానం చేశారా? ఒకవేళ ఆమె ధ్యానం చేస్తే పిల్లల పరిస్థితి ఏమిటి? ఇన్ని రోజులపాటు ఆమెకు ఆహారం ఎవరు ఇచ్చారు? ఆహారపదార్థాలను ఎవరు సరఫరా చేశారు? గుహలో చీకట్లో ఇన్ని రోజులపాటు ఆమె ఎలా ఉంది? క్రూర మృగాలు సంచరించే చోట ఆమె అంత స్వేచ్ఛగా ఎలా బతికింది? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.
Also Read: Baloch Operation Bomb: బెలూచ్ బాంబ్ ఆపరేషన్.. పాకిస్థాన్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి..
గతంలోనే బిజినెస్ వీసా మీద ఇండియాకు వచ్చిన కుటీనా చాలా రోజులపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంది. ఆ సమయంలో ఆమె వెంట పిల్లలు కూడా ఉన్నారు. భర్త రష్యా లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె ఇన్ని రోజులపాటు రాకపోయినప్పటికీ.. ఆమె ఆచూకీ లభించకపోయినప్పటికీ అతడు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఆమెను అధువులకు తీసుకున్న కర్ణాటక పోలీసులు.. వివరాలు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె ఇంగ్లీషులో మాట్లాడుతున్నప్పటికీ.. కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెబుతోంది. మిగతా వాటికి నిశ్శబ్దాన్ని ఆశ్రయిస్తున్నది.
A startling incident has come to light from Gokarna in Karnataka’s Uttara Kannada district, where a Russian woman was found living in a cave deep inside the forest with her two young daughters. During a routine patrol pic.twitter.com/7d96FOMah3
— Kashmir Patriot (@KashmirPatriot) July 13, 2025