తెలంగాణRain Alert: వరుసగా 2 తుపాన్లు.. రానున్న 5 రోజులు జోరు వానలు

Rain Alert: వరుసగా 2 తుపాన్లు.. రానున్న 5 రోజులు జోరు వానలు

Rain Alert: వేసవి ఎండలతో ఇన్నాళ్లు అల్లాడిన జనానికి జూన్‌ ప్రారంభంలోనే కాస్త ఊరట లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ఈసారి రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. దీంతో జూన్‌ ప్రారంభం నుంచే వాతావరణం చల్లబడింది. అడపాదడప వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం రుతుపవనాలు రెండు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు కీలక ప్రకటన చేసింది. రెండు తుపాన్ల కారణంగా రెండు రాష్ట్రాల్లో జూన్‌ 7 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

బంగాళాఖాతంలో రెండు తుపాన్లు..
ఈసారి ముందుగానే వచ్చిన నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తిగా విస్తరించాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో రెండు తుపాన్లు ఏర్పడ్డాయి. తమిళనాడుకు సమీపంలో ఒక తుపాను తరహా వాతావరణం ఉండా, ఆంధ్రప్రదేశ్‌ సమీపంలో తుపాను ఏర్పడింది. వీటివలన రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని, పిడుగులు పడతాయని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని తెలిపింది.

హైదరాబాద్‌లో జోరు వాన..
ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇన్నాళ్లపాటు తీవ్ర నీటి ఎద్దడి, నీళ్ల కరువుతో ఇబ్బంది పడ్డ బెంగళూరు దాహం తీరేలా భారీ వర్షం కురిసింది. 133 ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేసింది. దేశవ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. మరోవైపు ఈ ఏడాది అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది రైతులకు ఊరటనిచ్చే వార్త. ఇక ఇప్పటికే వర్షాలు కురుస్తుండడంతో రైతులు వ్యవసాయ పనులు మొదలు పెట్టారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

AP Aarogyasri Services: ఏపీలో నిలిచిన ఆరోగ్యశ్రీ.. ప్రభుత్వ ఆప్షన్ అదే!

AP Aarogyasri Services: ఏపీలో( Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. పేరుకుపోయిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు సేవలు నిలిపివేసాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి...

AP Government: ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్!

AP Government: ఏపీ ప్రభుత్వం( AP government) దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి సరికొత్త వాహనాలను అందించనుంది. త్రిచక్ర వాహనాలను ఉచితంగా పంపిణీ చేయనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది....

Most Popular

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Malla Reddy : మల్లారెడ్డి హ్యాండిచ్చాడు.. బీఆర్ఎస్ కారాలు మిరియాలు.. ట్విస్ట్ అదిరింది కదూ

Malla Reddy : మైక్ పట్టుకుంటే చాలు మల్లారెడ్డి కేటీఆర్.. కెసిఆర్.. హరీష్ రావు మీద పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. నూరేళ్లు కాదు వెయ్యిళ్లు బతకాలని కోరుతుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగు...

Harish Rao: బామ్మర్ది కేటీఆర్ ను సైడ్ చేసిన హరీష్.. ఏదో జరుగుతోంది

Harish Rao: భారత రాష్ట్ర సమితి ఓవైపు సోషల్ మీడియాలో బలంగా కనిపిస్తుంది. ఆ పార్టీ అగ్ర నాయకులు కేటీఆర్.. హరీష్ రావు నిత్యం ఆందోళనలకు పిలుపునిస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం...

Armoor MLA: తులం బంగారం పంచాయితీ.. కాంగ్రెస్ నేతల మెడలోని బంగారం గోవిందా.. సంచలన పిలుపు

Armoor MLA: తెలంగాణ రాజకీయాలలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆర్మూర్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా చర్చకు దారి తీస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫునుంచి రాకేష్ రెడ్డి...

Ration Card: రేషన్ కార్డ్ వినియోగదారులకు గుడ్ న్యూస్

Ration Card: దేశంలో ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని రేషన్ లబ్దిదారులకు గుడ్ న్యూస్...
Exit mobile version