Rain Alert: వేసవి ఎండలతో ఇన్నాళ్లు అల్లాడిన జనానికి జూన్ ప్రారంభంలోనే కాస్త ఊరట లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ఈసారి రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. దీంతో జూన్ ప్రారంభం నుంచే వాతావరణం చల్లబడింది. అడపాదడప వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం రుతుపవనాలు రెండు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు కీలక ప్రకటన చేసింది. రెండు తుపాన్ల కారణంగా రెండు రాష్ట్రాల్లో జూన్ 7 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
బంగాళాఖాతంలో రెండు తుపాన్లు..
ఈసారి ముందుగానే వచ్చిన నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తిగా విస్తరించాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో రెండు తుపాన్లు ఏర్పడ్డాయి. తమిళనాడుకు సమీపంలో ఒక తుపాను తరహా వాతావరణం ఉండా, ఆంధ్రప్రదేశ్ సమీపంలో తుపాను ఏర్పడింది. వీటివలన రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని, పిడుగులు పడతాయని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని తెలిపింది.
హైదరాబాద్‌లో జోరు వాన..
ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇన్నాళ్లపాటు తీవ్ర నీటి ఎద్దడి, నీళ్ల కరువుతో ఇబ్బంది పడ్డ బెంగళూరు దాహం తీరేలా భారీ వర్షం కురిసింది. 133 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. దేశవ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. మరోవైపు ఈ ఏడాది అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది రైతులకు ఊరటనిచ్చే వార్త. ఇక ఇప్పటికే వర్షాలు కురుస్తుండడంతో రైతులు వ్యవసాయ పనులు మొదలు పెట్టారు.