Love Mouli Movie Review: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రతి సినిమాలో ఏదో ఒక రకమైన ఎలిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ని సాధించడానికి చాలా మంది నటులు తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే చాలా సంవత్సరాల నుంచి సినిమాలు చేస్తూ వచ్చినప్పటికీ సరైన సక్సెస్ లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు ‘నవదీప్'(Navadeep)… ఇక ఆయన మరోసారీ హీరోగా మారి ‘లవ్ మౌళి’ అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి మన ముందుకి వచ్చాడు. అయితే ఈ సినిమా ఎలా ఉంది. నవదీప్ కి ఈ సినిమాతో మంచి సక్సెస్ దక్కిందా? కొత్త కాన్సెప్ట్ అంటూ సినిమా రిలీజ్ కి ముందు చెప్పుకుంటూ తిరిగిన నవదీప్ ఇందులో ఏమాత్రం వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. అనేది మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే మౌళి (నవదీప్) అనే వ్యక్తి చిన్నతనంలోనే తన అమ్మానాన్నని కోల్పోవడం వల్ల తన తాతయ్య దగ్గర పెరుగుతాడు. మౌళి కి 14 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తాతయ్య కూడా మరణించడంతో ఒక్కడే తనకు నచ్చినట్టుగా తన లైఫ్ ను లీడ్ చేస్తూ ముందుకు వెళుతూ ఉంటాడు. ఇక ఈ క్రమంలోనే తనకు నచ్చినట్టుగా ఉంటాడు. నచ్చిన బట్టలు వేసుకుంటూ, ఇష్టం వచ్చినట్టుగా బతికేస్తూ ఉంటాడు. ఇక మౌళి మేఘాలయాల్లో నివసిస్తూ ఉంటాడు. సరిగ్గా అక్కడే ఒకరోజు అడవుల్లో ఒక అఘోర పరిచయం అవుతాడు. అతనితో ప్రేమ, పెళ్లి మధ్య జరిగిన చిన్నపాటి గొడవలో అతను మౌళికి ఒక బ్రష్ ఇస్తాడు.
ఇక స్వతహాగా మౌళి పెయింటర్ అవడంతో తనకు కోపం వచ్చిన, బాధేసిన, ఆనందంగా అనిపించిన ప్రతిసారి పెయింటింగ్ వేస్తూ ఉంటాడు. ఇక అలాంటి క్రమంలోనే ఆ ఘోర ఇచ్చిన మ్యాజిక్ బ్రష్ తో పెయింట్ వేయడంతో ఇందులో నుంచి చిత్ర (పంఖురి గిద్వాని) ఆ పెయింట్ నుంచి నిజంగానే బయటకు వస్తుంది. ఇక తనతో పాటు మౌళి ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలో తనతో జరిగిన కొన్ని గొడవల్లో భాగంగా మరోసారి ఆ బ్రష్ తో చిత్ర బొమ్మ గీస్తాడు. ఇక దాంతో డిఫరెంట్ పర్సనాలిటీతో చిత్ర బయటికి వస్తుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది. చిత్ర కి మౌళి కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు అవనీంద్ర ఈ సినిమాని రొటీన్ లవ్ స్టోరీ గా కాకుండా ఒక ఫాంటసీ మూడ్ లోకి తీసుకెళ్లి చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. ఇక అందులో భాగంగానే నవదీప్ క్యారెక్టరైజేశన్ ను బిల్డ్ చేసుకున్న విధానం గాని స్క్రిప్ట్ మొత్తాన్ని అల్లుకున్న పద్ధతి గాని ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగానే అనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ అంత లాగ్ అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ నుంచి సినిమా మాత్రం చాలా ఫాస్ట్ గా ముందుకు నడుస్తూ ఉంటుంది. ఇక నవదీప్ తన బాడీ లాంగ్వేజ్ లో చేసుకున్న మార్పులు ఈ సినిమాలో చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా షట్ లేకుండా తన బాడీని చూపించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ బాడీని షేపౌట్ అవ్వకుండా చాలా స్టిఫ్ గా ఉండే విధంగా డిజైన్ చేసుకున్న విధానమైతే బాగా నచ్చింది. ఇక దర్శకుడు అవనీంద్ర రాజమౌళి శిష్యుడు కావడం వల్ల అతని మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.
ఇక దానికి తగ్గట్టుగానే తను రాసుకున్న కథ ప్రేక్షకుడిని మెప్పిస్తుందని ఒక దృఢ సంకల్పంతోనే ఆయన మొదటి నుంచి కూడా సినిమా మీద మంచి అంచనాలు పెట్టుకుంటూ వస్తున్నాడు. ఇక ఈ సినిమాలో వచ్చే సీన్స్ తాలూకు ఇంపాక్ట్ ని డబుల్ చేయడానికి సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా వరకు హెల్ప్ అయింది. ఇక మొత్తానికైతే అవనీంద్ర ఏదైతే పేపర్ మీద రాసుకున్నాడో దాన్ని హానెస్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. ఇక అందులో కొంతవరకు ఆయన తడబడ్డప్పటికీ చాలావరకు సినిమాని సక్సెస్ ఫుల్ గా డీల్ చేశారనే చెప్పాలి. ఇక సినిమా క్లైమాక్స్ విషయానికి వస్తే రొటీన్ రెగ్యూలర్ సినిమా ఫార్మాట్లోనే క్లైమాక్స్ ఇవ్వడం అనేది సగటు ప్రేక్షకుడికి నిరాశ కలిగించే అంశం అనే చెప్పాలి. ఇక ఈ సినిమా అంతా ఏదో హై ఎక్స్పెక్టేషన్స్ తో తీసుకొచ్చి రొటీన్ గా కథను ముగించడం అనేది చాలామందికి నచ్చకపోవచ్చు… మొత్తానికైతే అవనీంద్ర పెట్టిన ఎఫర్ట్ మాత్రం సినిమాలో చాలా బాగా కనిపిస్తుంది.
ఇక నవదీప్ లుక్ విషయంలో బాగున్నప్పటికీ ఆయన హెయిర్ స్టైల్ కొంచెం చూసే వాళ్లకు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. మరి అంత హెయిర్ కాకుండా కొంచెం తగ్గించి పెట్టుంటే బాగుండేది. ఇక ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ గాని, బోల్డ్ సీన్స్ గాని చాలా ఉన్నాయి. లిప్ లాక్ సీన్స్ ని వదిలేస్తే, బోల్డ్ సీన్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది అని ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి మాత్రం తప్పకుండా ఒక డౌట్ అయితే వస్తుంది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికొస్తే నవదీప్ చాలా అద్భుతంగా నటించడమే కాకుండా సరికొత్త గెటప్ లో కనిపించి మరోసారి తనలో ఉన్న వైవిధ్యాన్ని బయటకి తీసి నటించాడనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు నవదీప్ అంటే ఒక డీసెంట్ లవర్ బాయ్ లుక్ లో కనిపిస్తూ వచ్చాడు. కానీ ఇది మాత్రం దానికి విభిన్నంగా ఉండడం, ఆయన ఆ క్యారెక్టర్ లో అలవోకగా నటించడం అనేది ఆయనకు చాలా వరకు ప్లస్ అయింది. ఇక తన ఫిజికల్ ఫిట్నెస్ పరంగా అయిన, యాక్టింగ్ ఇంప్రూవ్ మెంట్ పరంగా అయిన గత సినిమాలతో పోల్చుకుంటే చాలావరకు మెరుగుపరుచుకున్నాడనే చెప్పాలి… ఇక హీరోయిన్ గా చేసిన పంఖురి గిద్వాని తన పరిధి మేరకు ఓకే అనిపించింది. కాగా అఘోర గెటప్ లో నటించిన రాణా మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. ఇక రాణా నవదీప్ కి మధ్య వచ్చే సీన్స్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచాయనే చెప్పాలి. మిగిలిన క్యారెక్టర్ లో నటించిన వారందరూ వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు…
Also Read: Pushpa 2: పుష్ప 2 సినిమాకు తప్పని రీ షూట్లు…కారణం ఏంటి..?
టెక్నికల్ అంశాలు
ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సినిమా మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. ఇంకా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంది. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడంలో గోవింద్ వసంత్ సక్సెస్ అయ్యాడు. అలాగే విజువల్స్ కూడా ఈ సినిమాని టాప్ నాచ్ లో నిల్చోబెట్టాయనే చెప్పాలి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికొస్తే ఓకే అనిపించేలా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
నవదీప్ యాక్టింగ్…
ఫాంటసీ ఎపిసోడ్స్…
మైనస్ పాయింట్స్
కొన్ని సీన్లు చాలా బోరింగ్ గా ఉన్నాయి…
రోటీన్ క్లైమాక్స్…
Also Read: Manamey X Review: మనమే ట్విట్టర్ టాక్: ఫస్ట్ హాఫ్ అలా సెకండ్ హాఫ్ ఇలా, శర్వాకు హిట్ పడిందా?
రేటింగ్
ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5
చివరి లైన్
బోల్డ్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమాను బాగా నచ్చుతుంది…