Komatireddy Rajagopal Reddy : మొత్తానికి రాధాకృష్ణ తన నైజాన్ని బయట పెట్టుకున్నారు. తనను విమర్శిస్తే ఏమాత్రం తట్టుకోలేని రాధాకృష్ణ.. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి చరిత్రను మొత్తం తవ్వి పోశారు. ప్రతి ఆదివారం తన ఆంధ్రజ్యోతి పత్రికలో రాసే కొత్త పలుకు సంబంధించి టీజర్ ను ఏబీఎన్ లో వదులుతారు. దానికి వీకెండ్ కామెంట్ బై ఆర్కే అనే శీర్షికన టెలికాస్ట్ చేస్తారు.
వీకెండ్ కామెంట్ బై ఆర్కే టీజర్ ను ఏబీఎన్ రిలీజ్ చేసింది. అందులో రాధాకృష్ణ ఘాటు పదాలు వాడారు. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి అనేక కీలకమైన విషయాలను బయటపెట్టారు.. ఇటీవల రాధాకృష్ణ ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర మీడియా అంటూ రాధాకృష్ణను తిట్టారు. రాధాకృష్ణ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. అంతేకాదు తనకు వంద పత్రికలు.. చానళ్లు నడపగలిగే సత్తా ఉందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాధాకృష్ణ అదును కోసం చూశారు. మొత్తంగా గట్టి కామెంట్లు చేశారు.
వీకెండ్ కామెంట్ బై ఆర్కే లో రాధాకృష్ణ రాజగోపాల్ రెడ్డిని మిత్రమా అంటూనే చురకలు అంటించారు.”మంత్రి పదవి ఇస్తానని మాట తప్పిన అధిష్టానాన్ని నిలదీయలేక నన్ను ప్రశ్నిస్తున్నావేంటి మిత్రమా.. ఉద్యమంలోని చరిత్ర బయటపెట్టానా.. పార్టీలు మారిన నీ చరిత్రను తవ్వి పోశానా.. వంద చానళ్లు.. వంద పత్రికలు పెట్టే దమ్ము ఉంటే నిన్ను ఎవరు వద్దన్నారు.. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు.. నామీద చూపిస్తున్నావేంటి మిత్రమా..” అంటూ రాజగోపాల్ రెడ్డికి సుతి మెత్తని హెచ్చరికలు చేశారు. ఈ హెచ్చరికలు రాజగోపాల్ రెడ్డి ని భయపెడతాయా.. అది సాధ్యమవుతుందా.. రాధాకృష్ణ ఎంతటి మొండివాడో.. రాజగోపాల్ రెడ్డి కూడా అలాంటివాడే.. పైగా తన మంత్రి పదవి కోసం ఓపెన్ గానే సవాళ్లు విసురుతున్నాడు.
ఈ ప్రకారం రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు చరిత్ర.. పార్టీలు మారిన చరిత్ర రాధాకృష్ణ దగ్గర ఉందని చెప్పకనే చెప్పారు. రాధాకృష్ణకు ఓపెన్ గానే రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. ఆ లెక్కన రాధాకృష్ణ కూడా రాజగోపాల్ రెడ్డికి ఓపెన్ గా సవాళ్లు విసరచ్చు కదా.. మరి రాధాకృష్ణ ఎందుకు ఆగిపోయారు.. అంటే తెలంగాణ ప్రజలకు తెలియని విషయం.. రాధాకృష్ణకి తెలుసు. కాకపోతే దానిని బూచిగా చూపించి రాజగోపాల్ రెడ్డిని హెచ్చరించాడు. మరి ఈ హెచ్చరికలకు రాజగోపాల్ రెడ్డి భయపడతాడా..
Weekend Comment By RK | Promo | 29-08-2026 | ABN Telugu #WeekendCommentByRK #ABNMDRadhakrishna #WeekendComment #ABNAndhrajyothy #ABNTelugu pic.twitter.com/eOZx90qqQL
— ABN Telugu (@abntelugutv) August 29, 2026