Hyderabad: తెలంగాణ రాష్ట్ర రాజధాని.. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో వ్యభిచారం కూడా విచ్చల విడిగా పెరుగుతోంది. వ్యభిచారం అనేది ఒకప్పుడు తప్పుగా భావించేవారు.. కానీ విశ్వనగరంలో అది ఇప్పుడు సర్వ సాధారణమ అయింది. వ్యభిచారం తప్పు కాదని విచ్చల విడిగా చేస్తున్నారు. ఇక అమ్మాయిలు, మహిళలు కూడా అవసరాల కోసం వ్యభిచారాన్ని ఒక సర్వీస్‌గా భావిస్తున్నారు. తద్వారా ఆదాయం పొందుతున్నారు. దీంతో నగరాల్లో రాత్రిపూట వ్యభిచారం పడగ విప్పుతోంది. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా వ్యభిచార ముఠాలు బహిరంగంగానే బిజినెస్ సాగిస్తున్నాయి. ఒకవైపు ఆన్‌లైన్‌లో హైటెక్ పద్ధతుల్లో.. ఇంకోవైపు మసాజ్, స్పా సెంటర్లు వ్యభిచార కేంద్రాలుగా మారుతున్నాయి.
ఆన్‌లైన్‌లో విటులకు ఎర..
ఆన్‌లైన్‌లో కొన్ని ముఠాలు డబ్బు సంపాదనే లక్ష్యంగా అమ్మాయిల ఫొటోలు అప్‌లోడ్ చేసి విటులకు ఎరవేస్తున్నాయి. ఇక కొన్ని మసాజ్ కేంద్రాలు, స్పా సెంటర్లు.. ఏజెంట్లను నియమించుకుని వ్యభిచారం గుట్టుగా సాగిస్తున్నారు. ఇందుకు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. పోటీలు ఇలాంటి కేంద్రాలపై దాడులు చేస్తున్నా ఖరీదైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో ధనవంతులే లక్ష్యంగా ఇళ్ల మధ్యనే ఇలాంటి కేంద్రాలు నిర్వహిస్తున్నారు.
ఈజీ మనీకి అలవాటు పడి..
ఇక ఈజీ మనీకి అలవాటు పడిన యువుతలు, మహిళలు సొంతంగా వ్యభిచారం నిర్వహించుకుంటున్నారు. బస్టాప్‌లు, ట్యాంక్‌బండ్ ఏరియా, పార్కుల్లో తిరుగుతూ పురుషులకు గాలం వేస్తున్నారు. ఇందుకు రూ.1000 నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. అవసరమైన రూంలను కూడా యువతులే సిద్ధంగా ఉంచుతున్నారు. ఈమేరకు చిన్న చిన్ని హోటళ్ల నిర్వాహకులతో ముందే మాట్లాడుకుంటున్నారు. కమీషన్ పద్ధతిలో రూంలను బుక్ చేయించి.. గుట్టుగా తమ దందా కొనసాగిస్తున్నారు.
రాత్రి 9 నుంచి తెల్లవారు జాము వరకు..
ఇక ఇలాంటి అమ్మాయిలు, యువతులు రాత్రి 9 గంటలకు రోడ్లపైకి వస్తున్నారు. బస్టాప్‌లు, పార్కులు, జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్ల వద్ద వద్ద అడ్డా వేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చే వారికి, దూర ప్రాంతాలకు వెళ్లే వారికి వల విసురుతున్నారు. దీంతో బస్టాప్‌లలో నిలబడే మహిళలు ఇబ్బంది పడాల్సి వస్తోంది.