Homeఎంటర్టైన్మెంట్Rashmi Gautam comments : వీళ్ళను వెంటనే ఇరాన్ దేశానికీ పంపేయండి అంటూ యాంకర్ రష్మీ...

Rashmi Gautam comments : వీళ్ళను వెంటనే ఇరాన్ దేశానికీ పంపేయండి అంటూ యాంకర్ రష్మీ సంచలనం కామెంట్స్!

Rashmi Gautam comments : ఇరాన్ దేశం పై ఇజ్రాయిల్ , అమెరికా సైన్యం చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీమ్ లీడర్ ఖమేనీ మృతి పై మన భారతీయుల్లో కొంతమంది ఆందోళన చేప్పట్టడాన్ని నిన్నటి నుండి మనమంతా చూస్తూనే ఉన్నాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిమ్స్ వివిధ నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోనళ కార్యక్రమాలు చేపట్టారు. అందులో మన హైదరాబాద్ కూడా ఉంది. సోషల్ మీడియా లో కూడా మన భారత దేశానికీ చెందిన కొంతమంది నెటిజెన్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ట్విట్టర్ వేలకొద్దీ ట్వీట్స్ పడుతూనే ఉన్నాయి. ఇలా ఆందోనళ కార్యక్రమాలు చేస్తున్న వారిపై చాలా మంది తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెహల్గామ్ లో ఉగ్రదాడి జరిగినప్పుడు ఒక్కరు కూడా ఇలా బయటకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేయలేదు. కానీ ఇతర దేశానికీ చెందిన నేత చనిపోతే మన జాతి పిత చనిపోయినంతలా బాధపడుతున్నారు అంటూ నెటిజెన్స్ మండిపడ్డారు.

ఇలా సపోర్ట్ చేస్తున్న వారిపై యాంకర్ రష్మీ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆమె మాట్లాడుతూ ‘మన దేశం లో పుట్టి పెరిగిన కొంతమంది ఇరాన్ సుప్రీమ్ ఖమేనీ చనిపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళను చూస్తే చాలా బాధేస్తుంది. ప్రధాని మోడీ గారు , వీళ్లందరినీ ఇరాన్ దేశానికీ పంపేయండి. అక్కడ వీళ్లంతా ఇరాన్ కోసం పోరాడుకుంటారు’ అంటూ నరేంద్ర మోడీ ని ట్యాగ్ చేస్తూ సెటైర్స్ వేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు సంచలనం గా మారింది. కొంతమంది ఈ ట్వీట్ కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అదే విధంగా వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ శాతం సపోర్ట్ చేశారు అనే చెప్పొచ్చు. సినీ ఇండస్ట్రీ కి చెందిన మహిళా అయినప్పటికీ కూడా ధైర్యం గా ఇలాంటి విషయాల్లో స్వరం వినిపించేందుకు చాలా గట్స్ కావాలి , అది రష్మీ లో ఉంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

కేవలం ఈ ఒక్క విషయం లోనే కాదు, రష్మిక మన సమాజం లో జరిగే అనేది విషయాలపై చాలా ధైర్యం గా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇంత ధైర్యం గా మిగతా సినీ సెలబ్రిటీలు కూడా వ్యవహరిస్తే బాగుంటుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా మారిన రష్మీ, ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ టీవీ షోస్ కి యాంకర్ గా వ్యవహరించింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది . ప్రస్తుతం ఆమె ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ మరియు శ్రీ దేవి డ్రామా కంపెనీ షోస్ కి మాత్రమే యాంకర్ గా వ్యవహరిస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Zomato Anniversary Campaign: బిల్డప్ కోసం లోగో తీసేస్తే.. కోట్లు బొక్క..

Zomato Anniversary Campaign: క్రియేటివిటీ.. ఇది ఆకర్షించే విధంగా ఉండాలి. జనాలలో ఆలోచన తెచ్చే విధంగా ఉండాలి. ఒకరకంగా నూతనత్వం వైపు అడుగులు వేసే విధంగా ఉండాలి. అలాకాకుండా చదివేస్తే ఉన్న...

Yashasvi Jaiswal: ఒక్క డిన్నర్.. ఈ క్రికెటర్ జీవితాన్ని ఎలా మార్చిందంటే..

Yashasvi Jaiswal: ఇప్పుడు మనం సోషల్ మీడియా కాలంలో ఉన్నాం. ఏదైనా జరిగితే చాలు.. దానికి తగ్గట్టుగా కథలు అల్లడం.. దానిని వ్యాప్తిలోకి తీసుకురావడం అలవాటుగా మారిపోయింది. సోషల్ మీడియా కాలంలో నిజాలకు విలువలేదు....

Jailer 2: రజినీకాంత్ ‘జైలర్ 2’ విషయంలో ఆ తప్పు జరగబోతుందిగా…

Jailer 2: రజనీకాంత్ హీరోగా నెల్సన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'జైలర్ 2' సినిమా అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జైలర్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. దాంతో జైలర్...

Hardik Pandya: హార్దిక్ చెప్పినట్టు.. సీఎస్కే మేనేజ్మెంట్ ఆడుతోంది.. ఏం జరుగుతుందో..

Hardik Pandya: గొప్ప ఆటగాడే. గతంలో గుజరాత్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. మరోసారి ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. కానీ ఆ తర్వాత మనోడి ఆట మారిపోయింది. బౌలింగ్ తన స్థాయిలో...

RHA Movement: దేశవ్యాప్తంగా మరో ఉద్యమం.. ఈసారి అదే లక్ష్యం!

RHA Movement: సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన కాక్రోచ్ వ్యాఖ్యల నుంచి పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మొన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా ఉద్యమించిన సీజీపీ నీటి...
Oktelugu Epaper
Exit mobile version