Amaravati : ‘అమరావతి’ పై ప్రభుత్వం కీలక నిర్ణయం..

Amaravati : రైతులతో సమావేశం కూడా అయ్యారు. వీలైనంత త్వరగా ఈ రహదారుల కనెక్టివిటీ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు కృత నిశ్చయంతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Written By: NARESH, Updated On : July 1, 2024 3:02 pm

Amaravati

Follow us on

Amaravati : అమరావతి రాజధాని విషయంలో గతంలో జరిగిన తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు పడుతోంది చంద్రబాబు సర్కార్. ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా రాజధానిలో రవాణా సౌకర్యం పై ఫోకస్ పెట్టింది. రాజధానికి సరైన రోడ్డు లేదని గతంలో రాజకీయ విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటువంటి విమర్శలకు చెక్ చెప్పాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే.. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై చంద్రబాబు దృష్టి పెట్టారు. ముఖ్యంగా అమరావతిలో కీలక నిర్మాణాలను ఈ నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రాజధాని ప్రాజెక్టుల్లో రోడ్డు కనెక్టివిటీకి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికోసం ప్రస్తుతం ఉన్న కరకట్టను ప్రకాశం బ్యారేజీ నుంచి వెంకటపాలెం ప్రకృతి ఆశ్రమం వరకు 200 అడుగులు విస్తరించాలని నిర్ణయించింది. సీట్ యాక్సిస్ రోడ్డు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ఒక దశ, పిడబ్ల్యుడి వర్క్ షాప్ నుంచి సుందరయ్య నగర్ వరకు రెండో దశ ఫ్లైఓవర్, మణిపాల్ వర్కు మూడో దశలో కనెక్టివిటీ రహదారుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ప్రాధాన్యమైన సీడ్ యాక్సిస్ రోడ్డును విస్తరించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. పాత జాతీయ రహదారి ట్రంక్ రోడ్డు అనుసంధానం చేయాలని కూడా భావిస్తున్నారు. అమరావతి రాజధానిలో దీనినే తొలి ప్రాధాన్యత ప్రాజెక్టుగా ఎంపిక చేసుకున్నారు సిఆర్డీఏ అధికారులు.

2014లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. భూసేకరణ, అనుమతులు వంటి వాటి విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. పనుల ప్రారంభం పై ఆ ప్రభావం పడింది. కీలక నిర్మాణ పనులు ప్రారంభించినా.. రహదారుల నిర్మాణ విషయంలో ఆశించిన స్థాయిలో పురోగతి లేకుండా పోయింది. అదే విపక్షాల నుంచి విమర్శలకు కారణమైంది. రాజధాని అంతా బోగస్ అని.. కనీసం రోడ్డు సదుపాయం కూడా లేదని విపక్షాలు విమర్శలు చేస్తూ వచ్చాయి. అప్పట్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం దొండపాడు నుంచి వెంకట పాలెం రెవెన్యూ సరిహద్దు వరకు 20 అడుగుల వెడల్పుతో రోడ్డు వేసి ఆపేశారు. వైసిపి నుంచి రాజకీయ విమర్శలకు అదే కారణం అయ్యింది. అందుకే సీడ్ యాక్సెస్ రోడ్డును ఉండవల్లి సమీపంలో పాత జాతీయ రహదారికి, ప్రకాశం బ్యారేజీ దగ్గర కలపాలని నిర్ణయించారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డును మూడు దశల్లో విస్తరించి ఉన్నారు. ఇందుకు సంబంధించి భూ సమీకరణకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. రైతులతో సమావేశం కూడా అయ్యారు. వీలైనంత త్వరగా ఈ రహదారుల కనెక్టివిటీ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు కృత నిశ్చయంతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.