https://oktelugu.com/

Telangana Survey: తెలంగాణలో సంచలన సర్వే.. జబ్బలు చరుచుకుంటున్న బీజేపీ!

తాజాగా తెలంగాణలో నిర్వహించన సర్వే ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయని తెలుస్తోంది. రాష్ట్రంలో వాతావరణం మారిందని, అంతర్గత సర్వేతో బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లో రెండో స్థానంలో నిలుస్తుందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 7, 2024 / 11:35 AM IST

    Telangana Survey

    Follow us on

    Telangana Survey: పార్లమెంటు ఎన్నికలకు మరో వారంలో షెడ్యూల్‌ రాబోతోంది. దేశ భవిష్యత్‌ను నిర్దేశించి ఈ ఎన్నికల్లో మూడోసారి గెలిచి సత్తా చాటాలని బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఈమేరకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దేశమంతా సానుకూల ఫలితాలు ఉన్నందున ఈసారి 370 సీట్లు గెలవాలని టార్గెట్‌ పెట్టుకుంది. ఇందులో భాగంగా 190 సీట్లకు అభ్యర్థులను తొలిజాబితాలో ప్రకటించింది. మరో రెండు రోజుల్లో 150 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో తొలిజాబితాలో తెలంగాణలో 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

    అంతర్గత సర్వే..
    మరోవైపు బీజేపీ సొంతంగా ఈసారి అంతర్గత సర్వే నిర్వహిస్తోంది. ముఖ్యంగా సౌత్‌ నుంచి ఎక్కువ సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కాషాయదళం.. తమకు అనుకూలంగా ఉన్న కర్ణాటక, తెలంగాణపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో గెలిచే స్థానాలపై సర్వే నిర్వహించి లెక్కలు వేసుకుంటోంది.

    తెలంగాణలో సర్వే ఇలా..
    తాజాగా తెలంగాణలో నిర్వహించన సర్వే ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయని తెలుస్తోంది. రాష్ట్రంలో వాతావరణం మారిందని, అంతర్గత సర్వేతో బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లో రెండో స్థానంలో నిలుస్తుందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

    పోల్‌ స్ట్రాటజీ గ్రూప్‌ లెక్కలు..
    వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 9 నుంచి 10 స్థానాలు గెలుస్తుందని పోల్‌ స్ట్రాటజీ గ్రూప్‌ సర్వేలో తేలిందట. ఓట్ల శాతం 39.6 కాగ్రెస్‌కు వస్తాయని అంచనా వేసింది. ఇక బీజేపీ 6 నుంచి 9 స్థానాలు గెలుస్తుందని తెలిపింది. బీజేపీకి 32.3 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. ఇక తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ 0 నుంచి 1 స్థానానికి పరిమితమవుతుందని బీజేపీ సర్వేలో తేలింది. బీఆర్‌ఎస్‌కు 24.7 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. ఎంఐఎం కూడా 0 నుంచి 1 స్థానం గెలుస్తుందట. ఈ పార్టీకి కేవలం 3.5 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది.

    ఫలితాలను విశ్లేషిస్తున్న బీజేపీ..
    ఇక భారతీయ జనతాపార్టీ పోల్‌ స్ట్రాటజీ సర్వే ఫలితాలను విశ్లేషిస్తోంది. ఈ సర్వేలో ఎంత వరకు నిజముంది.. ఏయే స్థానాలు గెలవబోతోంది అని లెక్కలు వేస్తోంది. స్వల్ప తేడాతో ఓడిపోయే సీట్లలో పుంజుకునేందుకు ఏం చేయాలని అంతర్గతంగా చర్చించుకుంటోంది. మొత్తంగా ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో సంతోషంగా ఉంది. ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి దోహదపడతాయని కమలం నేతలు పేర్కొంటున్నారు.