Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వరుసగా సక్సెస్ లను అందుకుంటు స్టార్ హీరోలుగా మారుతారు. అయితే కొన్ని సక్సెస్ లు వచ్చిన తర్వాత హీరోలకి ఆటోమేటిగ్గా వాళ్ల మీద వాళ్లకి పూర్తి కాన్సిడెన్స్ అయితే వస్తుంది. దాంతో స్టోరీ లా ఎంపికలో వాళ్ళకి వాళ్లే ఓన్ డిసిజన్స్ తీసుకుందామనే ఆలోచనలో ఉంటారు. అయితే అప్పటివరకు స్క్రిప్ట్ విషయంలో వాళ్ళ అన్నలుగానీ, నాన్నలు గానీ హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ ఇక అప్పటి నుంచి వాళ్ళే ఓన్ డెసిజన్ తీసుకోవాలనే ఆలోచనలో ఉంటారు. ఇక అలాంటి క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఒక్కడు’ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత వాళ్ల నాన్న అయిన కృష్ణ(Krishna) గారి సపోర్టు లేకుండా కొన్ని సినిమాలకి కమిట్ అయ్యాడు. వాటి వల్ల ఆయన ఎలాంటి రిజల్ట్ ని పొందాడు అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ఒక్కడు సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత మహేష్ బాబు గుణశేఖర్ తో చేసిన అర్జున్ సినిమాని మహేష్ ఓన్ డిసిజన్ తో ఓకే చేశాడు. ఇక గుణశేఖర్ ఎలాంటి కథ అయితే చెప్పాడో ఆ కథలో ఎలాంటి మిస్టేక్స్ చెప్పకుండా అదే కథని ఉన్నది ఉన్నట్టుగా తెరకెక్కించాడు. దానివల్ల ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే కృష్ణ గారికి ఈ సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వదని తెలిసిపోయిందట. ఇక అదే విషయాన్ని మహేష్ బాబు దగ్గర కూడా చెప్పాడట. దాంతో మహేష్ బాబు కొద్ది వరకు ఫీల్ అయినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి.
కృష్ణ గారు చెప్పినట్టుగానే సినిమా యావరేజ్ గా ఆడింది. ఇక ఆ తర్వాత మళ్లీ కృష్ణ గారి డిసిజన్స్ మేరకే అతడు, పోకిరి సినిమాలను చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ లు సాధించాయి. మరొక సారి తనే ఓన్ డిసిజన్స్ తీసుకొని సక్సెస్ కొట్టాలని అనుకున్నాడు. అందులో భాగంగానే మరోసారి గుణశేఖర్ తో ‘సైనికుడు ‘ అనే సినిమా చేశాడు…ఇక ఈ సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత అందరూ సినిమా బాగుందని సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పారట. కానీ కృష్ణ గారు మాత్రం మహేష్ బాబు తో ఈ సినిమా అసలు ఆడదు అని మహేష్ మొహం మీదే చెప్పేశాడంట.
దాంతో మహేష్ బాబు మాత్రం వాళ్ళ నాన్న తన మీద కోపంతో ఏదో అలా చెప్తున్నాడు కానీ ఈసారి మనం పక్కగా హిట్టు కొట్టబోతున్నాం అని మనసులో అనుకున్నాడట. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కృష్ణ గారు చెప్పినట్టుగానే మొదటి రోజే ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక అప్పటినుంచి మహేష్ బాబు వాళ్ళ నాన్న చెప్పినట్టుగానే ఫాలో అవుతూ వచ్చాడు. ఇక కృష్ణ గారు గత సంవత్సరం లో మరణించడం వల్ల మహేష్ బాబు కి వాళ్ల నాన్న లేని లోటు అయితే ఏర్పడిందనే చెప్పాలి…