Nikki Haley: అమెరికా అధ్యక్ష రేసు నుంచి వైదొలిగిన నిక్కీ హేలీ.. వారిద్దరి మధ్యే పోటీ! కారణం ఇదే

సౌత్‌ కరోలినాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిక్కీ హేలీ మాట్లాడారు. తన క్యాంపెయిన్‌ నిలిపివేయాల్సిన సమయం వచ్చిందని ప్రకటించారు. అమెరకన్లకు తన గళం వినిపించాలని కోరుకున్నానని తెలిపారు.

Written By: Raj Shekar, Updated On : March 7, 2024 11:29 am

Nikki Haley

Follow us on

Nikki Haley: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లిక్‌ పార్టీ తరఫున పోటీ చేసేందుకు జరుగుతున్న అభ్యర్థిత్వ రేసు నుంచి భారత సంతతికి చెందిన నిక్కీ మేలీ తప్పుకున్నారు. ఈమేరకు ఆమె ప్రకట చేశారు. దీతో అధ్యక్ష పీటం కోసం మరోసారి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్యనే పోటీ ఉండనుంది.

గళాన్ని వినిపించాను..
సౌత్‌ కరోలినాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిక్కీ హేలీ మాట్లాడారు. తన క్యాంపెయిన్‌ నిలిపివేయాల్సిన సమయం వచ్చిందని ప్రకటించారు. అమెరకన్లకు తన గళం వినిపించాలని కోరుకున్నానని తెలిపారు. ఆ పని చేశానని వెల్లడించారు. పోలీ నుంచి తప్పుకుంటున్నందుకు బాధ లేదని పేర్కొన్నారు. నమ్మిన అంశాలపై మాత్రం గళం వినిపించగలిగానని తెలిపారు. ఈ సందర్భంగా డొనాల్డ్‌ ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. అందరి ఓట్లు సంపాదించేలా చూసుకోవాలని సూచన కూడా చేశారు.

ట్రంప్‌కు మద్దతు ఇస్తారా?
ఇదిలా ఉండగా సౌత్‌ కరోలినా మాజీ గవర్నర్, యూఎస్‌ అంబాసిడర్‌ అయిన నిక్కీ హేలీ.. ట్రంప్‌ను సమర్థిస్తారా లేదా అనే అంశంపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. నిMీ ్క సన్నిహితులు ఆమె తప్పుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమె ట్రంప్‌కు మద్దతు ఇవ్వాలని సూచిస్తున్నారు. కొందరు మాత్రం ఆమె తప్పుకుని ట్రంప్‌కు లైన్‌ క్లియర్‌ చేయడాన్ని తప్పు పడుతున్నారు.

సూపర్‌ మంగళవారం..
మరోవైపు మంగళవారం జరిగిన సూపర్‌ ట్యూస్‌డే ప్రైమరీల పోరులో హేలీ ఓడిపోయారు. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఎంపిక కావడానికి 1,215 మంది ప్రతినిధుల మద్దతు కావాలి. ఫలితాల్లో ట్రంప్‌కు 995 మంది మాత్రేమ ఉన్నారు. ట్రంప్‌తో పోలిస్నే నిక్కీ వెనుకపడ్డారు. దీంతో ఆమె అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ప్రకటన చేశారు.

డజను మంది పోటీ..
ఇదిలా ఉండగా ప్రైమరీల పోటీల్లో నిక్కీ, రామస్వామితోపాటు డజన్‌మందికిపైగా బరిలో దిగారు. అయితే ప్రైమరీలు మొదలైన నాటి నుంచి మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ఆధిపత్యం కొనసాగించారు. దీంతో ప్రధాన పోటీదారులు ఒక్కొక్కరుగా వైదొలిగారు. చివరగా నిక్కీ కూడా తప్పుకున్నారు. దీంతో రిపబ్లికన్‌ అభ్యర్థిగా ట్రంప్‌ దాదాపు ఖరారయ్యారు. డెమోక్రాట్ల అభ్యర్థి బైడెన్‌ ముందంజలో ఉన్నారు. అయితే లాంఛనంగా పార్టీ తరఫున నామినేషన్‌ వేయడానికి ట్రంప్‌కు ఈనెల 12 వరకు బైడెన్‌కు 19 వరకు సమయం ఉంది.