Nara Lokesh : ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువై 9 నెలలు పూర్తి అయ్యింది. ఈ 9 నెలల్లో అభివృద్ధి ఏ స్థాయిలో పరుగులు పెడుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. అధికారం లోకి వచ్చిన వెంటనే సామజిక పెన్షన్లు నాలుగు వేల రూపాయలకు పెంచి సంచలనం సృష్టించిన కూటమి ప్రభుత్వం ఆ తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపకం, మెగా డీఎస్సీ, ప్రతీ గ్రామంలోనూ నాణ్యమైన సీసీ రోడ్లు, సిమెంట్ రోడ్లు ఇలా ఒక్కటా రెండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. కలలో కూడా సాధ్యం అవ్వదు అనుకున్న విశాఖపట్నం ప్రైవేటీకరణ రద్దు, వైజాగ్ రైల్వే జోన్ ఏర్పాట్లు వంటివి జరిగాయి. అదే విధంగా కొత్త రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నుండి నిధులు, పోలవరం ప్రాజెక్ట్ కి నిధులు,ఇలా 9 నెలల్లో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టారు.
Also Read : నా భార్య బ్రాహ్మణి నుంచి అది నేను నేర్చుకోవాలి.. నారా లోకేష్
సూపర్ సిక్స్ పథకాలు లోని అతి ముఖ్యమైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటివి కూడా మే నెల నుండి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాటి కొరకు బడ్జెట్ ని ఏర్పాటు చేయడం వంటివి కూడా జరిగింది. ఒకపక్క అభివృద్ధి, మరోపక్క సంక్షేమ కార్యక్రమాలు సమపాళ్లలో జరగడానికి చంద్రబాబు నాయుడు అనుభవం తోడైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మన రాష్ట్రానికి సుమారుగా ఆరు లక్షల పెట్టుబడులు పెట్టే ఎమ్మెన్సీ కంపెనీలను తీసుకొచ్చాడు. రీసెంట్ గానే ఆయన ఒక ప్రముఖ జాతీయ మీడియా కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు అద్భుతమైన సమాదానాలు అందించాడు.
యాంకర్ ఆయన్ని ఒక ప్రశ్న అడుగుతూ ‘నిన్న రేవంత్ రెడ్డి ని ఇంటర్వ్యూ చేసాము. ఆయన హైదరాబాద్ భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది అన్నాడు. మీకు అలా విశాఖపట్నం భవిష్యత్తులో అలాంటి సిటీ అవుతుందని అంటున్నారు. కానీ తెలంగాణ కి హైదరాబాద్ లాంటి క్యాపిటల్ సిటీ అడ్వాంటేజ్ ఉంది, కర్ణాటకు అలా బెంగళూరు సిటీ ఉంది, కానీ ఆంధ్ర ప్రదేశ్ కి అలాంటి అడ్వాంటేజ్ లు లేవు కదా?’ అని అంటాడు. అప్పుడు నారాలోకేష్ దానికి సమాధానం ఇస్తూ ‘మాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు..అదే మా అడ్వాంటేజ్. మేము ఈరోజు మా పనులను ఇంత వేగవంతంగా చేస్తున్నామంటే, అందుకు కారణం చంద్రబాబు గారే. అందుకు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రీసెంట్ గానే 17 వ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో మంత్రుల ఫైల్ క్లియరెన్స్ పై సమీక్ష జరిగింది. మా హోమ్ మినిస్టర్ అనిత గారి ఫైల్స్ కొన్ని పెండింగ్ లో ఉంటే, వెంటనే క్లియర్ చేయండి అర్జెంటు గా అని ఆదేశించాడు. ఆయన మమ్మల్ని అంత వేగవంతంగా పరుగులు తీయిస్తున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి.
Also Read : రాటుదేలుతున్న లోకేష్.. ఆ విషయంలో చాలా మెచ్యూర్డ్‌గా..