Nara Lokesh: మహిళా దినోత్సవం సందర్భంగా ఇండియా టుడే కాన్ క్లేవ్ పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించింది. దానికంటే ముందు ఒకరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోనూ ఈ కార్యక్రమాన్ని జరిపింది. మహిళా దినోత్సవం రోజు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తో సుదీర్ఘమైన ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూను ఇండియా టుడే ప్రెసిడెంట్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ను పలు ప్రశ్నలు అడిగారు.
Also Read: రాటుదేలుతున్న లోకేష్.. ఆ విషయంలో చాలా మెచ్యూర్డ్‌గా..
” ఈరోజు మహిళా దినోత్సవం. మీ అమ్మగారు శక్తివంతమైన మహిళ.. మీ భార్య కూడా.. వాళ్ల దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? వాళ్లు మీ కుటుంబానికి నిర్ణేత శక్తులుగా ఉన్నారు కదా.. మహిళా దినోత్సవం రోజు వారి గురించి మీరు ఏమైనా చెబుతారా” అని రాజ్ దీప్ అడగగా.. నారా లోకేష్ దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పారు..” నేటికీ నా భార్య బ్రాహ్మణి నా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తుంది. నేను నా తల్లి నుంచి, నా భార్య నుంచి చాలా నేర్చుకున్నాను. నా భార్య శక్తివంతమైన మహిళ. మా అమ్మగారు కీలకంగా ఉన్న హెరిటేజ్ డెయిరీ లో బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆ సంస్థ ఇప్పుడు 4,200 కోట్ల వ్యాపారం చేస్తోంది. బ్రాహ్మణి నుంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ను నేను నేర్చుకోవాలి. ఉదయం తను హెరిటేజ్ ఆఫీస్ కి.. నేను నా శాఖ పనులకి వెళ్తుంటాం. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత నా ఆరోగ్యం గురించి.. నేను మాట్లాడే విధానం గురించి బ్రాహ్మణి అడుగుతుంటుంది. ఏవైనా లోపాలు ఉంటే చెబుతుంది. అదే సమయంలో మా ఏకైక కుమారుడు నారా దేవాన్ష్ చదువు గురించి కూడా వాకబు చేస్తూ ఉంటుంది. అతడి ఎదుగుదలని.. నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటుంది. నన్ను కూడా తన కొడుకులాగా చూసుకుంటుంది. మా ఇంటి పర్యవేక్షణ మొత్తం మా అమ్మ, నా భార్య ఆధ్వర్యంలోనే కొనసాగుతూ ఉంటుంది. అప్పుడు మా నాన్నగారి రాజకీయ ఎదుగుదలలో మా అమ్మ కీలకపాత్ర పోషిస్తే.. ఇప్పుడు నా రాజకీయ ఎదుగుదలలో నా భార్య ముఖ్యపాత్ర పోషిస్తోందని” నారా లోకేష్ వ్యాఖ్యానించారు.. ఇక ఇదే వేదికపై గత వైసీపీ ప్రభుత్వం పై నారా లోకేష్ నిప్పులు చెరిగారు.
నా భార్య నా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లిస్తుంది. నేను ఆమె నుండి ఏదైనా నేర్చుకోవాలంటే అది ‘వర్క్-లైఫ్ బాలన్స్’. – నారా లోకేష్#NaraLokesh #NaraBrahamani#TDP#IndiaTodayConclave25 #Rajdeep pic.twitter.com/PDryZAFCVM
— Anabothula Bhaskar (@AnabothulaB) March 8, 2025
వైసిపి పరిపాలన కాలంలో..
రాజ్ దీప్ అడిగిన ఇంకొన్ని ప్రశ్నలకు నారా లోకేష్ సమాధానం చెప్పారు. ముఖ్యంగా గత వైసిపి పరిపాలనలో జరిగిన విధానాలపై నారా లోకేష్ ఆగ్రహం గా మాట్లాడారు. ” వైసిపి పరిపాలన కాలంలో అక్రమంగా ఇసుక మైనింగ్ జరిగింది.. కానీ ఇప్పుడు అలా జరగకుండా మేము చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్వాంటేజ్ గా పనిచేస్తున్నారు. టాటా పవర్ తో 7 గిగా వాట్స్ ఒప్పందం కుదుర్చుకున్నాం. మనమిత్ర పథకం ద్వారా వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. కుల ధ్రువీకరణ పత్రాలు, హాల్ టికెట్లు, ఇతర పత్రాలు, ల్యాండ్ రికార్డులను సులభంగా వాట్సప్ సేవలు ద్వారా పొందవచ్చు. విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం.. ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో మా వంతు భాగస్వామ్యం అందిస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సిద్ధంగా ఉంటూనే.. రాష్ట్రంలో తెలుగు భాషను విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాం. భాషను బలవంతంగా రుద్దుతున్నారు అనే వ్యాఖ్యలు సత్య దూరం.. ఇలాంటి విధానాన్ని నేను నమ్మను. వివిధ భాషలు నేర్చుకోవడం ఇప్పుడు అవసరం. వైసీపీ పరిపాలన కాలంలో జరిగిన అక్రమ ఇసుక మైనింగ్ విషయంలో సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. చాటి శాఖను నేను కావాలని ఎంచుకున్నానని.. అందులో బలమైన టీచర్ యూనియన్లు ఉన్నాయని.. విద్యార్థుల భవితవ్యాన్ని బాగు చేసేందుకు విద్యాశాఖ నాకు ఉపకరిస్తుంది.. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసినప్పుడు హైదరాబాద్లో 45,000 మంది ఐటి ఉద్యోగులు మద్దతుగా నిలిచారని” నారా లోకేష్ వ్యాఖ్యానించారు..”మహిళా దినోత్సవం ఒకరోజు తోనే సరిపెట్టుకునేది కాదని.. ప్రతిరోజు మహిళల దేనని.. ఇకపై నుంచి 50:50 నినాదంతో మహిళలు, పురుషులు పని చేయాలని” నారా లోకేష్ పేర్కొన్నారు.
Also Read: మహిళా దినోత్సవం : జగన్ ఇప్పుడు టార్గెట్ అయ్యాడుగా..