Cockroach Milk : ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం కదా. అయితే ఎందులో ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి అని తెలుసుకుని మరీ సేవిస్తుంటారు ప్రజలు. కానీ కొన్ని సార్లు మనం భయపడేవి, వింతగా అనిపించేవి కూడా మనకు చాలా ఉపయోగపడుతుంటాయి. అలాంటివే బొద్దింకలు. వాటి పాలు ప్రజలకు మేలు చేస్తాయట. అన్నింటికంటే ఇవి చాలా ప్రయోజనకరం అని బల్లగుద్ది చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అవును మీరు విన్నది నిజమే. వారి అధ్యయనం ఇదే విషయాన్ని వెల్లడించింది. తలుచుకుంటేనే కడుపులో దేవినట్టు అనిపిస్తుంది కదా. కానీ ఇటీవలి అధ్యయనాలు బొద్దింక పాలలో గేదె పాల కంటే మూడు రెట్లు ఎక్కువ కేలరీలు ఉన్నాయని చూపిస్తున్నాయి. ఇది ఆరోగ్యానికి మంచిదట కూడా. వినడానికి చాలా వింతగా ఉంది కదా. కానీ ఓ సారి క్లారిటీగా తెలుసుకుందాం.
Also Read : పాలతో పాటు ఇవి తింటే ఎంత నష్టమో తెలుసా?
బొద్దింక పాలు: వింతగా అనిపించినా సరే శాస్త్రవేత్తలు బొద్దింక పాలు మంచివి అంటున్నారు. ముఖ్యంగా డిప్లోప్టెరా పంక్టాటా జాతికి చెందిన బొద్దింక పాలలో ఆవు పాల కంటే మూడు రెట్లు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయని కనుగొన్నారు. ఈ విషయం పోషకాహార నిపుణులలో ఆసక్తిని రేకెత్తించింది. బొద్దింక పాలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయని ఎవరు నమ్ముతారు చెప్పండి. కానీ నమ్మాల్సిందే. పాలలో ప్రోటీన్లు, కొవ్వులు, చక్కెరలు పుష్కలంగా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. ఇది గ్రహం మీద అత్యంత పోషకాలు అధికంగా ఉండే ఆహారాలలో ఒకటిగా తేల్చారు.
బొద్దింక పాలు విలువైన పోషకాలను అందించే సామర్థ్యం కోసం, భవిష్యత్తులో ఆహార ఆవిష్కరణలలో పాత్ర పోషించవచ్చనే దానిపై ఇప్పుడు అధ్యయనం చేస్తున్నారు. పరిశోధన ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, ఈ ఆవిష్కరణ ప్రత్యామ్నాయ, స్థిరమైన ఆహార వనరులకు కొత్త ద్వారాలను తెరుస్తుంది.
జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ క్రిస్టల్లాగ్రఫీలో 2016లో ప్రచురితమైన ఒక అధ్యయనం, ఆడ పసిఫిక్ బీటిల్ బొద్దింకలు తమ పిల్లలకు ఆహారం ఇవ్వడానికి ఉత్పత్తి చేసే పాలు లాంటి ద్రవాన్ని విశ్లేషించింది. అయితే ఇదంులో గేదె పాల కంటే మూడు రెట్లు ఎక్కువ కేలరీలు ఉన్నాయని తేలింది. ది ఇండిపెండెంట్ ప్రకారం, బొద్దింకల పిల్లలకు ఆహారం పెట్టినప్పుడు, వాటి కడుపులో పసుపు రంగు పదార్థం స్ఫటికీకరించిందట. గతంలో అత్యధిక కేలరీలు కలిగిన క్షీరద పాలు అయిన గేదె పాల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ కేలరీలు కలిగి ఉందని పరిశోధకులు తెలిపారు. ఇందులో కణాల పెరుగుదల, మరమ్మత్తుకు సహాయపడే టన్నుల ప్రోటీన్, అమైనో ఆమ్లాలు, ఆరోగ్యకరమైన చక్కెరలు కూడా ఉన్నాయని తెలిపారు.
అన్ని సూపర్‌ఫుడ్‌ల మాదిరిగానే, అవి సాంప్రదాయ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను భర్తీ చేయకుండా సమతుల్య, వైవిధ్యమైన ఆహారాన్ని పూర్తి చేయాలని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఇవన్నీ ఉన్నప్పటికీ, ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం, బొద్దింక పాలు ఇంకా మానవ వినియోగానికి అందుబాటులో లేవు. సో జాగ్రత్త.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.