spot_img
Homeతెలంగాణ Etala Rajender : రియల్టర్‌ చెంప చెల్లుమనిపించిన ఎంపీ ఈటల రాజేందర్.. వైరల్ వీడియో

 Etala Rajender : రియల్టర్‌ చెంప చెల్లుమనిపించిన ఎంపీ ఈటల రాజేందర్.. వైరల్ వీడియో

Etala Rajender : ప్రజాప్రతినిధులు.. తమ ప్రజలకు అండగా ఉండాలి. అందుకే ఓటర్లు ఎన్నికల్లో గెలిపిస్తారు. ప్రజలకు కష్టం వచ్చినా.. నష్టం వచ్చినా సమస్య పరిష్కరించడం, అభివృద్ధి చేయడమే చట్ట సభల ప్రతినిధుల విధి. కానీ, చాలా మంది ఎన్నికల వరకే ప్రజలకు దండాలు పెడుతున్నారు. ఎన్నికల్లో గెలిచాకా ప్రజలను పట్టించుకునేవారే కరువవుతున్నారు. కానీ, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Etala Rajendar) మాత్రం ప్రజలను ఇబ్బంది పెండుతున్న ఓ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ చెంప చెల్లుమనిపించాడు. ప్రజల పక్షాన నిలిచారు. ఎవరైనా పేదలపై దౌర్జన్యం చేస్తే ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు. బ్రోకర్లకు అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల స్థలాలకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఏం జరిగిందంటే..
మల్కాజ్‌గిరి జిల్లా, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిల నగర్‌లో పేదలను ఇబ్బంది పెడుతున్న రియల్ట ఎస్టేట్‌ బ్రోకర్‌పై ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములను కబ్జా చేసి పేదలకు అన్యాయం చేస్తున్నారని తెలుసుకున్నారు. స్థానికులు కూడా ఎంపికీ ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం గ్రామానికి వచ్చిన ఈటల పేదల భూములను పరిశీలించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఎంపీని అడ్డుకుంటామని టెంట్లు కూడా తగలబెడతామని రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు(Real Estate Brokers) గ్రామస్తులను బెదిరించారు. ఈ నేపథ్యంలో ఈటల భూములను పరిశీలిస్తుండగా బ్రోకర్లు అక్కడకు వచ్చారు. వారిని చూసి ఆగ్రహానికి గురైన ఈటల ఓ బ్రోకర్‌ చెంప చెల్లుమనిపించారు.

గ్రామస్తుల దాడి..
ఈటల చేయి చేసుకోవడంతో ఆయన వెంట ఉన్న గ్రామస్తులు, నాయకులు కూడా మూకుమ్మడిగా బ్రోకర్లపై తిరగబడ్డారు. దొరికిన బ్రోకర్‌ను చితకబాదారు. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper