Jeevan Reddy : ఫలించిన కేసీ వేణుగోపాల్ మంత్రాంగం

Jeevan Reddy మొత్తానికి నాలుగు రోజులుగా సాగుతున్న టెన్షన్ కు తెరపడినట్లు అయింది. టీ కప్పులో తుఫాన్ లాగా సమస్య సాల్వ్ కావడంతో జీవన్ రెడ్డి వర్గీయులు ఊపిరి పీల్చుకున్నారు..

Written By: NARESH, Updated On : June 27, 2024 6:09 pm

Jeevan Reddy will resign from MLC

Follow us on

ఏ కారణంతో జీవన్ రెడ్డి అలక వీడారు..
అసలేం జరిగింది..? పార్టీ పెద్దలు ఏం హామీ ఇచ్చారు.. ఏంటా వివరాలు..

Jeevan Reddy : డైనమిక్ లీడర్.. పార్టీలో సీనియర్ నేత.. నిత్యం ప్రజలతో మమేకమవుతుంటారు. కార్యకర్తలతో ఆత్మీయంగా మెదులుతారు. కష్టసుఖాల్లో పాలుపంచుకుంటారు.. ప్రజా నేతగా గుర్తింపు పొందాడు. ఆయనే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి. ఆయన గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే.. ఇటీవల ఆయన పేరు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నది.

ప్రధాన కారణం ఏంటంటే.. బీఆర్ఎస్ కు చెందిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంతో అగ్గి రాజేసింది. నాకు ఒక్క మాట చెప్పకుండానే పార్టీలో ఎలా చేర్చుకుంటారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు విలువ ఇవ్వనందున ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో పార్టీ అధిష్టానం ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబును రంగంలోకి దించింది. ఆయన జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినా జీవన్ రెడ్డి మెట్టు దిగలేదు. పదవి త్యాజించేందుకే సిద్దమైనని స్పష్టం చేశారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సైతం మరో మారు జీవన్ రెడ్డిని కలిసి శాంతింప చేసే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది.

ఈ విషయాన్ని ఢిల్లీలో ఉన్న అధిష్టానానికి సమాచారం అందించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ నుంచి రంగంలోకి దిగి జీవన్ రెడ్డితో మాట్లాడారు. ఢిల్లీ వస్తే అన్ని మాట్లాడుకుందామని రావాలని ఆహ్వానించారు. దీంతో ఢిల్లీ వెళ్లిన జీవన్ రెడ్డి ముందుగా దీపా దాస్ మున్షితో సమావేశం అయ్యారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. తర్వాత ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ను కలిశారు. ప్రత్యేకంగా అరగంట పాటు మాట్లాడారు. పార్టీలో సీనియర్లందరికీ సముచిత స్థానం గౌరవం ఉంటుందని కేసీ వేణుగోపాల్ జీవన్ రెడ్డికి స్పష్టం చేశారు. ఫైనల్ గా ఆయనకు పార్టీ అండగా ఉంటుందనే హామీతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. ఎవర్ని అగౌరవ పరిచే విధంగా వ్యవహరించేది లేదని వ లేదని తెల్చి చెప్పారు. దీంతో జీవన్ రెడ్డి మెట్టు దిగి అలక వీడారు.

అనంతరం జీవన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఏ పార్టీకైనా కార్యకర్తలు ముఖ్యమని, వారి ఆలోచనకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. పార్టీ కార్యకర్తల మనోభావాలు, ఆవేదనను పరిగణనలోకి తీసుకోవడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అని పేర్కొన్నారు. మొత్తానికి నాలుగు రోజులుగా సాగుతున్న టెన్షన్ కు తెరపడినట్లు అయింది. టీ కప్పులో తుఫాన్ లాగా సమస్య సాల్వ్ కావడంతో జీవన్ రెడ్డి వర్గీయులు ఊపిరి పీల్చుకున్నారు..