Kalki 2898 AD: కల్కి మూవీ చూసి రాజమౌళి ఫస్ట్ రియాక్షన్ ఇదీ..

నాగ్ అశ్విన్ టేకింగ్ గాని, అమితాబ్, దీపిక పదుకొనే ల సపోర్టు గాని, ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ గాని ఓవరాల్ అన్ని కలిసి సినిమాని బ్లాక్ బస్టర్ గా నిలిచేలా చేశాయి అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

Written By: Gopi, Updated On : June 27, 2024 6:21 pm

Kalki 2898 AD

Follow us on

Kalki 2898 AD: ఈరోజు రిలీజ్ అయి సక్సెస్ బాటలో దూసుకుపోతున్న కల్కి సినిమా మీద ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రెటీలు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక దర్శక ధీరుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి సైతం ఈ సినిమా మీద తన ఒపీనియన్ ని తెలియజేయడమనేది సినిమా యూనిట్ కి చాలా వరకు ఒక బూస్టప్ ఇచ్చినట్టు అయింది.

ఇక ఈ సినిమాను చూసిన జక్కన్న ఈ సినిమాలో చివరి 30 నిమిషాలు అద్భుతమైన లోకాన్ని చూసినట్టుగా అనిపించిందని… కంప్లీట్ గా కల్కి ప్రపంచాన్ని పరిచయం చేశారని. అలాగే నాగ్ అశ్విన్ టేకింగ్ గాని, అమితాబ్, దీపిక పదుకొనే ల సపోర్టు గాని, ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ గాని ఓవరాల్ అన్ని కలిసి సినిమాని బ్లాక్ బస్టర్ గా నిలిచేలా చేశాయి అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఇక మొత్తానికైతే రాజమౌళి ఈ సినిమా సక్సెస్ పట్ల చాలా సంతోషాన్ని వ్యక్తం చేశాడు.తెలుగు సినిమా అనేది ఇప్పుడు వరల్డ్ సినిమాను శాసించే స్థాయికి ఎదుగుతుంది.

కాబట్టి ఈ క్రమంలో కల్కి సినిమా రావడం అనేది అటు ఇండియాలో అయినా ప్రపంచంలో అయినా ఒక మంచి శుభ పరిణామం అనే చెప్పాలి. అందుకే రాజమౌళి కూడా ఈ విషయం మీద చాలా వరకు పాజిటివ్ గా స్పందిస్తూ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఇప్పటికైనా ప్రమోషన్స్ ని ఎక్కువ స్థాయిలో చేయమని సినిమా యూనిట్ తో చెప్పినట్టుగా తెలుస్తుంది. తద్వారా తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో గొప్ప పొజిషన్లో నిలబెట్టొచ్చని తన అభిప్రాయం…

ఇక మొత్తానికైతే రాజమౌళి కూడా ఇప్పుడు మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఆయన కూడా మరొక విజువల్ వండర్ ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు… ఇక ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా తెలీదు గానీ, తొందర్లోనే రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది…