Congress vs BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

Congress vs BRS ప్రస్తుతానికి పార్టీ మారే ఉద్దేశం లేదన్న గంగుల కమలాకర్ భవిష్యత్తులో ఇదే మాటకు కట్టుబడి ఉంటారో లేదో చూడాలి మరి. రాజకీయంలో ఏదైనా సాధ్యమే..

Written By: NARESH, Updated On : June 27, 2024 5:52 pm

Congress bumper offer to BRS MLA

Follow us on

-బీసీ ఎమ్మెల్యేకు గాలం వేసిందా..?
-ఉచ్చులోకి లాగేందుకురాయబారాలు పంపిందా..?
-ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే.. ఏంటా కథ

Congress vs BRS : ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్ఎస్ విలవిలలాడుతున్నది. హస్తం పార్టీ గూటికి చేరుతున్న ఎమ్మెల్యేలతో బలహీన పడుతున్నది. దీంతో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై ఫోకస్ పెట్టింది. బీసీ ఎమ్మెల్యేకు గాలం వేసిందా.. ఉచ్చులోకి లాగేందుకు రాయబారాలు పంపిందా ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే పార్టీ మార్పు ప్రచారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇచ్చిన వివరణ ఏంది ఏంటి ఆ కథ.

మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణ పాలిటిక్స్ లో పరిచయం అక్కర్లేని నేత. అందరికీ సుపరిచితుడు. ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచారు. పిల్లలనుంచి పెద్దల వరకు ఆత్మీయంగా పలకరించే వ్యక్తి. ఆపదలో ఉంటే నేనున్నాననే మంచి మనసున్న నేత. కరీంనగర్ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వెలమల కోటాలో పాగా వేసిన బీసీ నేతగా చరిత్ర సృష్టించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈయన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డైరెక్ట్ గా విపక్షాలపై విరుచుకుపడేవారు. రివర్స్ అటాక్ చేస్తే అదే స్థాయిలో తిప్పి కొట్టేవారు. నాలుగో సారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సైలెంట్ అయ్యారు. అప్పట్లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేసి అందరూ దృష్టిని ఆకర్షించారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే ఈ ఎమ్మెల్యే స్వరం మూగపోయింది. కాంగ్రెస్ గాలిని తట్టుకొని బీఆర్ఎస్ వ్యతిరేకతను అధిగమించి ఎమ్మెల్యేగా బండి సంజయ్ పై తక్కువ మెజార్టీతో విజయం సాధించారు. 2023లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో టెన్షన్ లో పడ్డారు. ఎంతైనా మంత్రిగా పనిచేసిన నేత. ఆ దర్పం వేరు. కనుసైగలతో అధికారులను ఆదేశిస్తే ఆగమేఘాలమీద పనులు జరిగేవి. కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు. బండ్లు ఓడలు ఓడలు బండ్లు అన్నట్లు కాలం సాగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆరు నెలలుగా గంగుల సైలెంట్ అయ్యారు. పార్టీ మారుతారు అని ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అప్పట్లో దీన్ని గంగుల కొట్టి పారేశారు. ఎన్నికల ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ పై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ఇన్నాళ్లు బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న కరీంనగర్ జిల్లాలో ఆ పార్టీని దెబ్బతీసే స్ట్రాటజీకి పదును పెడుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో తొలి వికెట్ పడగొట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అత్యంత సన్నిహితుడు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. నెక్స్ట్ టార్గెట్ గంగుల కమలాకర్ అని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత గంగుల ముభావంగా ఉంటున్నారు. పార్టీ మారతారని ప్రచారం జరిగింది. కరీంనగర్లో గంగుల అనుచరులపై భూకబ్జా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కొందరు జైలుకెల్లారు. దీంతో పార్టీ మారితేనే మంచిదని ఒత్తిడి వచ్చిందట. ఎక్కడ డైరెక్ట్ గా చెప్పలేదు. ఇంటర్నల్ సర్కిల్లో టాక్ నడిచింది. చేరికలపై ప్రస్తావించిన కార్పొరేటర్లతో ఆగస్టులో ఏదైనా జరగవచ్చు అని చెప్పారట. తెలంగాణ పటిష్టతపై బిజెపి ఆలోచన ఎలా ఉందో తెలియదని, రెండు నెలల వరకు ఆగుదామని చెప్పినట్లు పొలిటికల్ సర్కిల్లో వినిపించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ కి వెళ్తే కొత్తగా ఒరిగేదేమి ఉంటుందని నిర్వేదం వ్యక్తం చేశారట. అందులోకి వెళ్లిన మంత్రి పదవి ఇవ్వరు కదా అని కార్యకర్తల సమావేశంలో ప్రస్తావించడం గమనించదగ్గ విషయం.

ఇటీవల మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఒక మాజీ మంత్రి కాంగ్రెస్ లోకి వస్తారని మీడియా చిట్ చాట్ లో హింట్ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో గెలిచిన మాజీ మంత్రులు ఇద్దరే. అందులో ఒకరు కేటీఆర్ మరొకరు గంగుల కమలాకర్. గంగుల కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం బలంగా జరిగింది. విలేకరులు అడిగితే మాత్రం కాంగ్రెస్లో చేరే ఉద్దేశం లేదు అని స్పష్టం చేశారు. ఆ అవసరం కూడా లేదని చెప్పారు. ఇటీవల కార్పొరేటర్లను తీసుకొని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. కాంగ్రెస్ ఉచ్చులో పడవద్దని, భవిష్యత్ మనదేనని భరోసా కల్పించారు కేసీఆర్. అధైర్యపడవద్దని ప్రజల పక్షాన నిలబడి కొట్లాడాలని చెప్పారట. ఆ తర్వాత కూడా పార్టీ మారే అంశంపై ప్రచారం ఆగలేదు. కాంగ్రెస్కు చెందిన కీలక నేత కరీంనగర్ కు వస్తే గంగుల కమలాకర్ ఇంట్లోనే భోజనం చేసేవారని, దీంతో గంగులను కాంగ్రెసులోకి ఆహ్వానించేందుకే సీఎం రేవంత్ రెడ్డి రాయబారం పంపారనే చర్చ సాగింది ఈనెల 23న కేసీఆర్ ను కలిసిన తర్వాత గంగుల వారం రోజులపాటు ఫారిన్ టూర్ వెళ్లారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమి జరుగుతుందో వేచి చూడాలి. ప్రస్తుతానికి పార్టీ మారే ఉద్దేశం లేదన్న గంగుల కమలాకర్ భవిష్యత్తులో ఇదే మాటకు కట్టుబడి ఉంటారో లేదో చూడాలి మరి. రాజకీయంలో ఏదైనా సాధ్యమే..