MLC Kavitha: ఏహే అలా కాదు.. అసలు కమలం పార్టీలోనే గులాబీని మెర్జ్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయని.. గులాబీ బాస్ కూతురు నేరుగా వ్యాఖ్యలు చేస్తోంది. మీడియా చిట్ చాట్ లో ప్రముఖంగా ప్రస్తావించింది. “కొంతకాలంగా గులాబీ బాస్ కూతురు ఒకరకమైన నిరాశలో ఉంది. పార్టీలో సరైన గుర్తింపు లేక.. తన స్థానం ఏమిటో తెలియక.. సోదరుడు మొత్తం హైజాక్ చేస్తుంటే తట్టుకోలేక.. ఇలాంటి వ్యక్తం చేస్తోంది.. అంతేకాదు గులాబీ బాస్ డాటర్, ఆమె మేన బావకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తామని.. హస్తం హై కమాండ్ ఆఫర్ ఇచ్చిందని హస్తం పార్టీలో కొందరు నేతలు కూడా అంతర్గతంగా వ్యాఖ్యలు ఇస్తున్నారు. ఒకవేళ ఇదే గనుక వాస్తవమై ఉంటే.. తన కుమారుడిని సీఎం పీఠం మీద కూర్చోబెడతానంటే.. గులాబీ పార్టీని కమలంలో కలిపేస్తానని కేసిఆర్ ఆఫర్ ఇచ్చాడు అనడంలో పెద్ద ఆశ్చర్యం మాత్రం ఏముంది. ఇప్పుడే కాదు గతంలో హస్తంలో కలపడానికి తన పార్టీని రెడీ చేయలేదా కేసీఆర్? సో మొత్తంగా కూతురు హస్తంలోకి.. మిగతావాళ్లు కమలంలోకి వెళ్లిపోతే దుకాణం మొత్తం బంద్ అవుతుంది” ఇవీ కరుడుగట్టిన గులాబీ కార్యకర్త వ్యక్తం చేసిన ఆవేదన.
అతడు చెప్పిన మాటలు కాకపోయినా.. కాస్త లోతుగా ఆలోచిస్తే గులాబీ క్యాంపులో ఆందోళన పెరిగింది. తీవ్రమైన స్తబ్దత ఏర్పడింది. ఒక రకమైన వింత నిశ్శబ్దం అక్కడ చోటుచేసుకుంది. గులాబీ వర్కింగ్ ప్రెసిడెంట్, గులాబి బాస్ కూతురు మధ్య జరుగుతున్న పంచాయితీ తెలంగాణలో పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. ఇప్పటికే రాధాకృష్ణ పత్రిక గులాబీ బాస్ కూతురు మీద రకరకాల వార్తలు రాసింది. అఫ్కోర్స్ అది అతడి సోర్స్. గతంలోజగన్ సోదరి పార్టీ పెడుతుందని.. జగన్ నుంచి బయటకు వస్తుందని రాధాకృష్ణ రాస్తే అందరూ తిట్టి పోశారు. చివరికి షర్మిల కూడా అదే స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరికి ఏమైంది.. పార్టీ అయితే పెట్టింది గాని.. దిక్కు దిశ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో నిమజ్జనం చేసింది. ఇప్పుడు జాగృతి అధినేత్రి కూడా.. కెసిఆర్ మాత్రమే నా నాయకుడు.. నాది గులాబీ పార్టీ అని చెబుతోంది. దగ్గరగా పరిశీలిస్తే మాత్రం ఆమె అడుగులు మాటలకు విభిన్నంగా వెళుతున్నాయి. తిరుగుబాటు ధోరణిలో సాగుతున్నాయి.
ఊహించిన దాని కంటే ముందుగానే గులాబీ క్యాంపులో ముసలం ఏర్పడటం.. అధికార హస్తానికి కలిసి వస్తోంది. ఈ పరిణామం వల్ల ప్రజా సమస్యలు కాస్త పక్కదారి పడుతున్నాయి. మొత్తానికి తాము క్రియేట్ చేయాలనుకున్న హడావిడి.. గులాబీ బాస్ కూతురు రూపంలో నెరవేరుతోందని హస్తం పార్టీ సంబరపడుతోంది. ” నామీద అడ్డగోలుగా రాయిస్తున్నారు. నన్ను టార్గెట్ చేశారు. ఆ ఇంటి ఆడబిడ్డను నేను కాదా. నామీద కిరాయి వ్యక్తులతో విమర్శలు చేయిస్తారా.. అసలు నా మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు.. డాడీ కి ఎన్నో లెటర్స్ నేను రాశాను. అవి చదివేవాడు.. తర్వాత చింపేసేవాడు.. కానీ ఇది ఎందుకు బయటకు వచ్చింది” అని అడుగుతోంది గులాబీ సుప్రీం డాటర్.. ఆమె ఆరోపించినట్టుగానే ఈ లేఖలు ఎవరు బహిర్గతం చేశారు? ఎప్పట్లాగానే వాటిని చదివి.. చింపి పడేయకుండా కేసీఆర్ ఎందుకు దాచుకున్నాడు.. వీటిని ఎవరు బహిర్గతం చేశారు..
తనమీద ఎవరి దాడి చేస్తున్నారు.. అడ్డగోలుగా విమర్శలు ఎవరు చేస్తున్నారు.. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని ఇబ్బంది ఎవరు పెడుతున్నారు.. వీటిపై గులాబీ సుప్రీం డాటర్ క్లారిటీ ఇస్తే బాగుండేది.. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక క్లాసిఫైడ్ వ్యవహారాలు దేనికి.. ఈ కథ మొత్తం నడిపిస్తున్న ఆ శక్తి ఎవరో తెలంగాణ సమాజానికి తెలియాలి కదా.. కావాలని పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ బాస్ డాటర్ ను ఓడించారట.. అదే గనుక గులాబీ సుప్రీం కూతురు నమ్మకం అయితే.. అప్పట్లోనే ఎందుకు ఈ వ్యవహారాన్ని రచ్చ రచ్చ చేయలేదు.. ఇప్పటిదాకా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నట్టు.. కమలం పార్టీ ఎంపీ రఘునందన్ రావు తన బిడ్డ పేరుతో హాస్పిటల్ కట్టాడు నిజమే. దాని ఓపెనింగ్ కి వెళ్ళింది గులాబీ పార్టీలో మూడో నెంబర్ గా ఉన్న వ్యక్తి.. అంటే గులాబీ బాస్ డాటర్ ప్రశ్నిస్తోంది తన మేన బావ నేనా.. గులాబీ పార్టీని… గులాబీ దళపతిని తామే నడిపిస్తున్నామని కొందరు అనుకుంటున్నారని.. సోషల్ మీడియాలో నన్ను తిట్టిపోస్తున్నారని గులాబీ సుప్రీం కూతురు ఆరోపిస్తోంది.. ఈ లెక్కన ఆమె కేటీఆర్ ను తప్పు పడుతోందా.. లేకుంటే కమలం లో పార్టీని కలిపే ప్రయత్నం చేశాడని తన తండ్రిని వేలెత్తి చూపిస్తున్నదా.. క్లారిటీ మిస్ అవుతోంది..
తన తండ్రికి నోటీసులు వస్తే ఎవరూ మాట్లాడలేదని.. మరొకరికి (గులాబీ కార్య నిర్వాహక అధ్యక్షుడు) నోటీసులు వస్తే హడావిడిగా ఖండనలు చేస్తున్నారని తెలంగాణ జాగృతి వాపోయింది. అంటే పార్టీ మీద తన సోదరుడు మాత్రమే పట్టు సాధించాడని.. తనని కూడా మించిపోయాడని చెబుతుందా గులాబీ బాస్ డాటర్.. వాస్తవానికి ఇవన్నీ కూడా నేరుగానే చెప్పవచ్చు. కానీ ఎందుకనో గులాబీ బాస్ డాటర్ జాగ్రత్తగా.. ఇన్ డైరెక్ట్ గా వ్యాఖ్యలు చేసింది. చూడబోతే తెగేదాకా లాగడానికి ఆమె ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది. మొత్తంగా ఈ వ్యవహారం తర్వాత ఆమెకు శివకాశి నోటీసులు వస్తే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..