RCB Vs PBKS Qualifier 1: ముల్లాన్ పూర్ వేదికగా పంజాబ్, బెంగళూరు అమీతుమీ తేల్చుకొనున్నాయి. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలలో రెండు జట్లు సమానంగా ఉన్నాయి. గత చరిత్రను చూసుకుంటే రెండు జట్లు సమానంగా ఉన్నాయి… ప్రస్తుత ఐపీఎల్ లో మాత్రం బెంగళూరుది అప్పర్ హ్యాండ్ గా కొనసాగుతోంది. గత నెలలో జరిగిన మ్యాచ్లో.. ఇదే మైదానంలో అయ్యర్ సేనపై బెంగళూరు ఘనవిజయం సాధించింది. వాస్తవానికి ఈ మ్యాచ్ ముల్లాన్ పూర్ లో జరగాల్సింది కాదు. కాకపోతే ఉగ్రవాద దేశంతో తలెత్తిన పరిస్థితుల వల్ల.. ఐపీఎల్ తాత్కాలిక వాయిదా పడింది. ఆ తర్వాత సవరించిన షెడ్యూల్ ప్రకారం ముల్లాన్ పూర్ లో ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ముల్లాన్ పూర్ లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు జరిగాయి. తొలి రెండు మ్యాచ్లలో 200 ప్లస్ పరుగులు నమోదు అయ్యాయి. అయితే తదుపరి మ్యాచ్లో 1111 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కాపాడుకుంది. ఇక మరో మ్యాచ్లో పంజాబ్ 157 స్కోర్ చేస్తే.. దానిని బెంగళూరు చేజ్ చేసి పడేసింది. అదే ఇది అత్యంత కీలకమైన మ్యాచ్ కావడంతో .. ఎలాంటి వికెట్ రూపొందిస్తారనేది చూడాల్సి ఉంది. అయితే ఇక్కడ వాతావరణం పొడిగా ఉంది. వర్షం కురిసే అవకాశాలు లేవు. అయితే ఎండ మాత్రం కాస్త తక్కువగా ఉంది. అంతకుముందు రోజులలో ఎండ విపరీతంగా ఉండగా.. గురువారం మాత్రం తక్కువ స్థాయిలో ఎండ ఉంది.
ఇక షెడ్యూల్ ప్రకారం క్వాలిఫైయర్ -1 మ్యాచ్ కు ఐపీఎల్ నిర్వాహక కమిటీ ఎటువంటి రిజర్వ్ డే కేటాయించలేదు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల మ్యాచ్ గనుక రద్దు అయితే.. బెంగళూరుకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుంది.అప్పుడు పంజాబ్ నేరుగా ఫైనల్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే పాయింట్ల పట్టికలో పంజాబ్ మొదటి స్థానంలో ఉంది కాబట్టి.. ఫైనల్ వెళ్ళిపోతుంది. అయితే ప్రస్తుతం వర్షాలు కురిసే అవకాశం లేకపోవడం వల్ల మ్యాచ్ సజావుగా సాగే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్ కు బెంగళూరు అభిమానులు భారీగా వస్తున్నారు. ఇప్పటికే మైదానం మొత్తం బెంగళూరు అభిమానుల రాకతో సందర్భంగా మారిందని జాతీయ మీడియాలో వార్త కథనాలు ప్రసారమవుతున్నాయి.
తుది జట్లు అంచనా ఎలా ఉందంటే..
పంజాబ్: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్య , ప్రభ్ సిమ్రాన్ సింగ్, జోస్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), నెహల్ వదేరా, శశాంక్ సింగ్, ఓమర్ జాయ్, స్టోయినీస్, హర్ ప్రీత్ బ్రార్, కైల్ జేమిసన్, అర్ష్ దీప్ సింగ్, చాహల్(ఇంఫాక్ట్ సబ్).
బెంగళూరు
రజత్ పాటిదార్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సాల్ట్, మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), కృణాల్ పాండ్యా, లివింగ్ స్టోన్, రోమారియో షెఫర్డ్, యశ్ దయాళ్, హాజిల్ వుడ్, సుయాష్ శర్మ (ఇంఫాక్ట్ సబ్)..