Investments In Karimnagar
Real Estate : రియల్ ఎస్టేట్(Real estate) వ్యాపారం రోజు రోజుకూ పుంజుకుంటోంది. ఒకప్పుడు వేలల్లో పలికిన భూముల ధరలు మొన్నటి వరకు లక్షలు, కోట్లు పలికాయి. దీంతో చాలా మంది భూమిపై పెట్టిన పెట్టుబడి ఏడాది రెండేళ్లకే రెట్టింపు కావడంతో చాలా మంది రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టారు. అయితే ఏడాది కాలంగా రియల్ వ్యాపారం బాగా తగ్గింది. గతంలో లక్షలు పెట్టి కొన్న భూములు అమ్ముడు పోకపోవడంతో పెట్టుబడులు స్ట్రక్ అయ్యాయి. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ధర తక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టి.. ధరలు పెరిగినప్పుడు అమ్మితే మంచి లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. ప్రస్తుతం కరీంనగర్‌లో ఇదే పరిస్థితి ఉంది. ఏడాది క్రితం వరకు భారీగా ధర పలికిన భూములను ఇప్పుడు మార్కెట్‌లో కొనేవారు కరువయ్యారు. దీంతో పట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే ధర తక్కువ ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టిన వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, ఇంకా పెరుగుతుందని భారీగా డబ్బులు పెట్టి కొన్నవారే ఇబ్బంది పడుతున్నారు.
పెట్టుబడికి మంచి సమయం..
కరీంనగర్‌లో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడికి ఇది మంచి సమయం అంటున్నారు మార్కెట్ నిపుణులు. కొంతకాలంగా అంతటా లావాదేవీలు తగ్గిపోయాయి. కొత్త జిల్లా విభజన తర్వాత కృత్రిమమైన హైప్(Temparary Hipe) రావడంతో పెద్ద ఎత్తున ధరలు పెంచారు. దీంతో చాలా మంది పెట్టుబడులు పెట్టారు. అవన్నీ ఇప్పుడు రీ సేల్ కావడం లేదు. పెట్టుబడి డబ్బులు స్ట్రక్ అయ్యాయి. అలాగని నష్టానికి అమ్ముకోలేని పరిస్థితి. మరోవైపు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టినవారు వడ్డీలు పెరుగుతుండడంతో ఆందోళన చెందుతుఆన్నరు. దీంతో కొందరు వ్యాపారులు ఇళ్లు, భూములు, ప్లాట్స్ అమ్మేందుకు రేట్లు తగ్గించేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఇప్పుడు పెట్టుబడి పెడితే మంచిదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అభివృద్ధికి అవకాశం..
కరీంనగర్ పట్టణం విస్తృతంగా అభివృద్ధి చెందడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. వచ్చే మూడు నాలుగేళ్లలో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరూ ఊహించనంతగా అభివృద్ధి చెందుతుందన్న అంచనాలు ఉన్నాయి. అయతే రెండేళ్ల క్రితమే గరిష్ట ధరలు ఉన్న భూములను ఇప్పుడు ఆ ధరకు కూడా కొనుగోలు చేసేవారు లేరు. ఈ తరుణంలో అమ్మేవారి నుంచి కొనుగోలు చేయడం మంచిందని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు పెట్టుబడి పెడితే నాలుగేళ్ల తర్వాత మంచి ధర వస్తుందని అంటున్నారు. అందుకే ఇప్పుడు కరీంనగర్‌లో పెట్టుబడి పెట్టడం మంచిదని పేర్కొంటున్నారు.