Homeఅంతర్జాతీయంUS trapped in Iran conflict: ఇరాన్ ఉచ్చులో చిక్కుకున్న అమెరికా.. మునిగిపోక తప్పదా?

US trapped in Iran conflict: ఇరాన్ ఉచ్చులో చిక్కుకున్న అమెరికా.. మునిగిపోక తప్పదా?

US trapped in Iran conflict: మాయల పకీరు ప్రాణం రామచిలకలో ఉన్నట్టు.. ఇప్పుడు అమెరికా మనుగడ ఇరాన్ చేతిలో ఉంది. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికీ నిజం. చాలామంది యుద్ధాన్ని ఒకే కోణంలో కవర్ చేస్తున్నారు. ఒకే విధానంలో చెబుతున్నారు. వాస్తవానికి వెస్ట్రన్ మీడియా ఒక కోణాన్ని మాత్రమే చూపిస్తోంది. అయితే మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధంలో అనేక కోణాలు ఉన్నాయి. ఈ యుద్ధంలో అందరికీ తెలిసినట్టుగానే అమెరికా పాలుపంచుకుంటున్నది. ఇరాన్ మీద గత పగలను ఇప్పుడు తీర్చుకుంటున్నది. భీకరంగా దాడులు చేస్తూ ఇరాన్ దేశాన్ని సర్వనాశనం చేస్తోంది.

అమెరికాకు చుక్కలు

సాధారణంగా అమెరికవేసే ఎత్తుగడలు చాలా పకడ్బందీగా ఉంటాయి. నష్టం జరిగిన తర్వాత గాని ఆ తీవ్రత ప్రత్యర్థి దేశాలకు తెలియదు. ఇరాన్, ఇరాక్, సిరియా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆ దేశాలన్నీ కూడా అమెరికా బాధిత వర్గం గానే ఉన్నాయి.

మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా తొలిసారిగా ట్రాప్ లో పడింది. అది కూడా ఇరాన్ వేసిన ఉచ్చులో చిక్కుకొని ఇబ్బంది పడుతోంది. యుద్ధం అంటే బాంబులు మాత్రమేనని.. గూడచర్యం చేస్తే సరిపోతుందని అమెరికా అనుకుంటుంది. కానీ ఆ స్ట్రాటజీని మించి ఇరాన్ సరికొత్త ట్రాప్ రూపొందించింది. అందులో అమెరికా చిక్కుకుపోయింది. ఇప్పటికే అమెరికా బాంబర్లు మొత్తం తిరుగుతున్నాయని.. ఇరాన్ మీద దాడులు చేస్తున్నాయని.. ఇరాన్ మొత్తం మా కంట్రోల్లో ఉందని ట్రంప్ గొప్పగా చెప్పుకుంటున్నాడు. వాస్తవానికి ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ మీద దారుణంగా మిస్సైల్స్ పడుతున్నాయి. వీటినుంచి కాపాడుకోవడానికి ఇజ్రాయిల్ భారీగా ఖర్చు పెడుతుంది. ఐరన్ డోమ్ విడుదల చేసే మిసైల్ ధర దాదాపు 50 కోట్ల వరకు ఉంటుంది. ఇక్కడే ఇరాన్ పంపించే డ్రోన్ ధర కేవలం 20 లక్షల వరకు ఉంటుంది. ఇక్కడ గణిత శాస్త్రంతో ఇరాన్ యుద్ధం చేస్తుంటే.. ఇజ్రాయిల్.. అమెరికా మాత్రం గాలిలో యుద్ధం చేస్తున్నాయి.

టార్గెట్ ట్రంప్

దుబాయ్, దోహా, కువైట్ వంటి వాణిజ్య నగరాల మీద ఇరాన్ కత్తి దుస్తోంది . దుబాయ్ మీద బాంబు వేస్తే గనక.. ఆ ప్రభావం ప్రపంచం మొత్తం ఉంటుంది. పర్యటకులు భయపడి పారిపోతారు. టూరిస్టులు దుబాయ్ వెళ్లడానికి సాహసించరు. దీంతో గల్ఫ్ అరబ్ షేక్ లు మొత్తం ట్రంప్ దగ్గరికి వెళ్తారు. అవసరమైతే అతడి కాలర్ పట్టుకుంటారు. ” మా సెక్యూరిటీ కోసం పైసలు తీసుకుంటున్నావు కదా.. ఇప్పుడు మా ఆస్తులు మొత్తం సర్వనాశనం అవుతున్నాయి. యుద్ధం ఆపుతావా? లేదా” అంటూ స్వరం పెకిలిస్తారు.

హర్ముజ్ జల సంధి

ప్రపంచం మొత్తానికి ఆయిల్ రవాణా కావాలంటే కచ్చితంగా హర్ముజ్ జల సంధి నే దిక్కు. దీని మీద నుంచి క్రూడ్ ఆయిల్ రవాణా కాకుండా ఇరాన్ అడ్డుకుంటున్నది. దీంతో సౌదీ ఆయిల్ రవాణా ఆగిపోయింది. ఖతార్ గ్యాస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. స్థూలంగా చూస్తే రోజుకు వేల కోట్లు నష్టం. 200 ఓడలు సముద్రంలో చిక్కుకుపోయాయి. వేలాది మంది కార్మికులు అందులోనే ఉన్నారు. ప్రపంచ మార్కెట్లు మొత్తం కుప్పకూలిపోతున్నాయి..

డ్రోన్ సిద్ధాంతం

ఇరాన్ ఒక డ్రోన్ రూపొందించడానికి 20 లక్షల వరకు ఖర్చు పెడుతుంది. అయితే ఇదే డ్రోన్ ను కూల్చివేయడానికి ఇజ్రాయిల్, అమెరికా ఇంటర్ సెప్టార్ ల కోసం 40 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నాయి. ఇరాన్ వందల వరకు డ్రోన్లను ప్రతిరోజు ఉపయోగిస్తుంది. వీటిని కూల్చివేయడానికి అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు వేలకోట్లను హారతి కర్పూరం మాదిరిగా ఖర్చు చేస్తున్నాయి. ఇక్కడ ఇరాన్ అనేది బ్యాంకు బ్యాలెన్స్ ద్వారా యుద్ధం చేస్తుంటే.. ఇది తెలియక అమెరికా డబ్బులను విచ్చలవిడిగా ఖర్చుపెడుతోంది.

పర్వతాలను ఉచ్చుగా చేసుకొని..

ఇరాన్ అనేది ఎడారి దేశం మాత్రమే కాదు.. దాని చుట్టూ పర్వతాలు ఉన్నాయి. ఇరాన్ దేశంలోకి వెళ్లడం పెద్ద కష్టం కాదు. దాని నుంచి బయటపడడం అంత ఈజీ కాదు. అమెరికా ఏదో అనుకుంటుంది కానీ.. అక్కడి జాగ్రస్ పర్వతాలు.. లోయలు.. విస్తారమైన ఎడారులు అమెరికాకు కొరుకుడు పడవు.. మొదట్లో ట్రంప్ ఇరాన్ మీద సింహం మాదిరిగా గర్జించాడు. ఇప్పుడేమో మార్జాలం మాదిరిగా సైలెంట్ అయిపోయాడు.

గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఉక్కు పాదం

ఇరాన్ దేశానికి ఇప్పటికే హిజ్బుల్లా రంగంలోకి దిగింది. లెబనాన్ ఫ్రంట్ కూడా యాక్టివ్ అయింది. ఈ ఇద్దరితో ఇజ్రాయిల్ దేశానికి సరిపోతుంది. ఇదే సమయంలో ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల గొంతును గట్టిగా నొక్కుతోంది. ఇప్పుడు యుద్ధం ఒక దిశలో లేదు. అది దాదాపు 5 దిశలలో సాగుతోంది. చరిత్ర ప్రకారం బలహీనుడు బలవంతుడు చేతిలో చనిపోతాడు. కానీ మొండివాడు రాజు కంటే బలంగా ఉంటాడు. ఈ మాటలో రాజు ఎవరు? మొండివాడు ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. స్థూలంగా ఈ యుద్ధం చెబుతున్న నీతి ఏమిటంటే అమెరికా దగ్గర ఆయుధాలు ఉండవచ్చు. పొగరు కూడా ఉండవచ్చు.. కానీ వీటన్నిటికీ మించిన చాకచక్యం ఇరాన్ దగ్గర ఉంది. ఇరాన్ కేవలం యుద్ధం నుంచి రక్షించుకోవడానికి మాత్రమే కాదు.. ట్రంప్ పొగరును.. అమెరికా బలుపును నేలకు దించడానికి అనేకమార్గాలు వెతుకుతోంది. ఇందులో భాగం గానే ఉచ్చులు పన్ని.. అందులో అమెరికా పడిపోయి.. గిలగిలా కొట్టుకునే పరిస్థితి దాకా తీసుకువచ్చింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version