Homeబిజినెస్iPhone 17 pro Price: iPhone 17 pro కొనాలని అనుకుంటున్నారా..?రూ.7,000 వరకు తగ్గింపు.. వెంటనే...

iPhone 17 pro Price: iPhone 17 pro కొనాలని అనుకుంటున్నారా..?రూ.7,000 వరకు తగ్గింపు.. వెంటనే త్వరపడండి..

iPhone 17 pro Price: iPhone కొనాలని చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. కానీ దీని ధర ఎక్కువగా ఉండడంతో చాలామంది వెనుకడుగు వేస్తారు. అయినా కూడా కొంతమంది ఐఫోన్ కొత్త సిరీస్ మార్కెట్లోకి వచ్చిందంటే క్యూలో నిలబడి మరీ కొంటారు. అయితే ఆపిల్ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఐఫోన్ 17 ప్రో సిరీస్ కు అత్యంత ఆదరణ లభించినట్లు తెలుస్తోంది. అయినా కూడా కొందరు దీనిని దక్కించుకోలేకపోయారు. అయితే ఇప్పుడు దీనిపై డిస్కౌంట్ ప్రకటించడంతో కొంతమంది ఆసక్తి చూపుతున్నారు. విజయ్ సేల్స్ ఐఫోన్ 17 ప్రో మొబైల్ పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. దీంతో ఈ ఫోన్ ను ఎంతవరకు కొనుగోలు చేయవచ్చు? ఇందులో ఉండే ఫీచర్స్ ఏంటి?

iPhone 17 pro సిరీస్ మార్కెట్లోకి వచ్చినప్పుడే దీనిపై యూత్ మనసు పారేసుకున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే ఫీచర్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. నేటి తరం వారికి ఈ ఫీచర్స్ బాగా ఉపయోగపడడంతో చాలామంది దీనిని కొనుగోలు చేయాలని ఆసక్తి చూపారు. ఈ మొబైల్లో A19 ప్రో చిప్ సెట్ ఉండనుంది. ఇది మూవీస్ చూసే వారితోపాటు గేమింగ్ కోరుకునే వారికి అద్భుతమైన వేగాన్ని అందిస్తుంది. అలాగే మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసేవారికి ఈ ప్రాసెసర్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ మొబైల్ అల్యూమినియం ఫ్రేమ్ తో డిజైన్ చేయబడింది. దీంతో ఫోన్ ఎలాంటి వేడి కాకుండా కాపాడుతూ ఉంటుంది..

ఐఫోన్ 17 ప్రో మొబైల్ 6.3 అంగుళాల డిస్ప్లేను చూడవచ్చు. ఇది కాంపాక్ట్ ఫోన్ కంటే పెద్ద సైజులో ఉంటుంది. గేమ్ ఆడే వారికి విజువల్స్ పెద్దగా కనిపిస్తాయి. అలాగే ఈ డిస్ప్లే కలర్లతో ఉండడం వల్ల చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో కెమెరా కూడా మెరుగైన పనితీరు ఉండేలా తెలుస్తుంది. ఈ మొబైల్లో 48 MP ఫ్యూజన్ కెమెరా సిస్టం ఉండనుంది. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 18 MP కెమెరా పనిచేయనుంది. బ్యాటరీ విషయంలో కూడా ఈ మొబైల్ ఏ మాత్రం తగ్గేదెలే అన్నట్టుగా ఉంటుంది. పూర్తిగా ప్రీమియం లుక్ తో కనిపించే ఈ మొబైల్లో హై ఎండ్ పనితీరు ఉండడం వల్ల రోజువారి వినియోగదారులతో పాటు విద్యార్థులకు ఈ మొబైల్ చాలా వరకు ఉపయోగపడుతుంది.

అయితే విజయ్ సేల్స్ లో భాగంగా దీనిపై భారీ డిస్కౌంట్ను ప్రకటించారు. ఐఫోన్ 17 ప్రో ప్రస్తుతం మార్కెట్లో రూ.1,34,900 ధరతో అందుబాటులో ఉంది. దీని పై రూ.2,410 ఫ్లాట్ బ్యాంకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. అలాగే ఐసిఐసిఐ, యాక్సిస్, HDFC బ్యాంకు క్రెడిట్ కార్డుల పై రూ.5,000 వరకు భారీ తగ్గింపును పొందవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version