Polluted cities in AP
Polluted cities in AP : ఏపీ( Andhra Pradesh) ప్రజలకు ఆందోళన కలిగించే విషయం మీది. రాష్ట్రంలో రెండు నగరాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సాగరనగరం విశాఖ( Visakhapatnam) తో పాటు విజయవాడ నగరాలు అత్యంత కలుషిత నగరాల జాబితాలో చేరాయి. ఇప్పటివరకు కాలుష్యం అనేది మహా నగరాలకు మాత్రమే ఉండేది. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాలను కాలుష్యం వేధించేది. వాటి సరసన మన రాష్ట్రానికి చెందిన రెండు నగరాలు చేరడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా విడుదలైన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎనర్జీ అంటే క్లీన్ ఎయిర్ ( సిఆర్ఈఏ) నివేదిక విడుదలైంది. గత ఏడాది సెప్టెంబర్ వరకు జరిగిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఈ విషతుల్యమైన గాలి కారణంగా ఏడు శాతం అకాల మరణాలు సంభవిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
* ఇప్పుడిప్పుడే అభివృద్ధి
అవశేష ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం తో పాటు విజయవాడ( Vijayawada) ప్రధాన నగరాలుగా ఉన్నాయి. ఇందులో విశాఖపట్నంకు పర్యాటకంగా మంచి పేరు ఉంది. ప్రశాంత వాతావరణానికి నెలవు అని అందరూ భావిస్తారు. కానీ అటువంటి నగరంలో వాయు కాలుష్య తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అటు విజయవాడ సైతం అదే పరిస్థితి లో ఉండడం భయం గోల్పుతోంది. సెప్టెంబర్ లో దేశంలో అత్యంత కలుషిత నగరాల జాబితాలో ఈ రెండు నగరాలు చేరాయి. మరోవైపు ఏపీవ్యాప్తంగా 26 నగరాలు, పట్టణాలు ఈ జాబితాలో చేరడం విశేషం.
* ఆ 13 నగరాల్లో
జాతీయ వాయు నాణ్యత ప్రమాణాలను అందుకోవడంలో ఏపీలోని 13 పట్టణాలు విఫలమైనట్లు జాతీయ కాలుష్య మండలి( National Pollution Board) చెబుతోంది. ఈ జాబితాలో విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కడప, ఒంగోలు, రాజమహేంద్రవరం, విజయనగరం, శ్రీకాకుళం ఉన్నట్టు పేర్కొన్నారు. 2026 నాటికి 131 నగరాలు / పట్టణాల్లో సూక్ష్మ ధూళీ కణాల సాంద్రతను 40 శాతం తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్రం జాతీయ వాయు శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. అయినా సరే ఏపీలో నగరాలు / పట్టణాలు ఈ విషయంలో పురోగతి సాధించలేకపోయాయి. అంతకుమించి కాలుష్యం దిగజారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఘనపు మీటరు గాలిలో అతి సూక్ష్మ ధూళికణాల సాంద్రత ఐదు మైక్రో గ్రాములు మించకూడదు. కానీ మన రాష్ట్రంలో 30 నుంచి 45 మైక్రో గ్రాముల మధ్య ఉండడం చూస్తుంటే.. పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
* రెండు సిగరెట్లు తాగిన ప్రభావం
అయితే కాలుష్య( pollution) ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి మనిషి పై ఆ ప్రభావం విపరీతంగా చూపుతోంది. రెండు సిగరెట్లు తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయో.. అలాంటి పరిస్థితి ఉందని రాజా అధ్యయనం చెబుతోంది. వాస్తవానికి సూక్ష్మ ధూళి కణాల సాంద్రత 15 మైక్రోగ్రాములకు మించకూడదు. కానీ రాష్ట్రంలో ఇది నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా విశాఖ తో పాటు విజయవాడలో ఉండే జనంలో సగభాగం కాలుష్యం బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఎక్కువగా పెరుగుతున్నాయి.
* పరిశ్రమల ప్రభావం
అయితే ఈ రెండు నగరాల్లో పరిశ్రమలు( industries) పెరుగుతున్నాయి. అదే సమయంలో నదులు, సముద్రాలు కూడా ఉన్నాయి. అందుకే కాలుష్యత్త పెరుగుతోంది. మరోవైపు మానవ తప్పిదాలు కారణంగా కాలుష్య కారకాలు కూడా పెరుగుతున్నాయి. వీటిని నియంత్రించాల్సిన అవసరం ప్రభుత్వంతో పాటు స్థానిక సంస్థలపై ఉంది. ముఖ్యంగా సామాజిక బాధ్యత పెరిగేలా అవగాహన కార్యక్రమాలు మరింత పెంచాలి. అప్పుడే సత్ఫలితాలు వస్తాయి. కాలుష్యం తగ్గి.. సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది. మరి ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.