Homeబిజినెస్Honda car discount: భారీ ఆఫర్.. ఈ Honda కార్లపై రూ.1.97 లక్షల ప్రయోజనాలు..

Honda car discount: భారీ ఆఫర్.. ఈ Honda కార్లపై రూ.1.97 లక్షల ప్రయోజనాలు..

Honda car discount: పండుగలు, ప్రత్యేక దినాల్లో కార్లపై ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో సేల్స్ పెంచుకునేందుకు కూడా భారీగా ప్రయోజనాలతో తగ్గింపులు అందిస్తారు. లేటెస్ట్ గా Honda కంపెనీ మూడు కార్లపై దాదాపు రూ.1.97 లక్షల ప్రయోజనాలను అందించేందుకు రెడీ అయింది. ఈ కంపెనీకి చెందిన మూడు కార్లు ఈనెల ఎండింగ్ లోపు కొనుగోలు చేస్తే ఇవి వర్తించనున్నాయి. ఇప్పటికే ఇవి ఎంతో ఆదరణ పొందిన కార్లు అయినప్పటికీ వీటిపై తగ్గింపు ధరను ప్రకటించడంతో మరింత సేల్స్ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంతకీ హోండా కంపెనీకి చెందిన ఏ ఏ కార్లపై..? ఎలాంటి డిస్కౌంట్లు ఉన్నాయో చూద్దాం..

Honda కంపెనీకి చెందిన సిటీ కారుపై డిస్కౌంట్లతో పాటు ఆఫర్లను ప్రకటించింది. సెడాన్ వేరియంట్ లో ఉన్న ఈ కారు మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా ఉంటుంది. ఇందులో 1.5 లీటర్ హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ ఇంజన్ ను అమర్చారు. ఈ ఇంజన్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. దీనిని ప్రస్తుతం రూ.20 లక్షల ధరతో విక్రయిస్తున్నారు. ఈ కారుపై రూ.1.97 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు అని తెలిపింది. అయితే కేవలం పెట్రోల్ వేరియంట్ ఉన్న కారుపై రూ.1.56 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఈ కారు ధర రూ.11.95 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.16.15 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

హోండా ఎలివేట్ కారుపై డిస్కౌంట్ లను ప్రకటించింది. మిడ్ సైజు SUV వేరియంట్ అయినా ఈ కారు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 121 హాఫ్ పవర్ అందిస్తూ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఈ కారు ధర రూ.11.6 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.16.25 లక్షల వరకు విక్రయిస్తున్నారు. దీనిపై రూ.1.81 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ మోడల్ ఎస్ యు వి హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ కు మాత్రం ఈ ఆఫర్ వర్తించదు.

ఇదే కంపెనీకి చెందిన అమేజ్ కారుపై కూడా తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ తోపాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 90 hp అందిస్తోంది. ప్రస్తుతం అమేజ్ ధర రూ.7.47 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.10 లక్షల వరకు విక్రయిస్తున్నారు. అయితే పాత అమేజ్ మోడల్ పై రూ.68,000 డిస్కౌంట్ రాగా.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అమేజ్ పై రూ.57,000 తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version