Homeజాతీయ వార్తలుVijay govt formation support parties: ప్రభుత్వ ఏర్పాటుకు.. విజయ్ కి కాంగ్రెస్ తో పాటు...

Vijay govt formation support parties: ప్రభుత్వ ఏర్పాటుకు.. విజయ్ కి కాంగ్రెస్ తో పాటు ఇంకా ఎవరు సపోర్ట్ ఇచ్చారో తెలుసా..

Vijay govt formation support parties: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇటీవల నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరిగి.. ఫలితాలు విడుదలైనప్పటికీ.. అందరి దృష్టి తమిళనాడు మీద ఉంది. కారణం ఇక్కడ ఏ పార్టీకి కూడా మెజారిటీ స్థానాలు రాలేదు. విజయ్ టీవీ కే పార్టీకి అధికంగా స్థానాలు వచ్చినప్పటికీ.. మ్యాజిక్ ఫిగర్ కు పది స్థానాల దూరంలో ఉంది. ఒకవేళ టీవీకేకు కాంగ్రెస్ పార్టీ మద్దతు […]

Vijay govt formation support parties: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇటీవల నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరిగి.. ఫలితాలు విడుదలైనప్పటికీ.. అందరి దృష్టి తమిళనాడు మీద ఉంది. కారణం ఇక్కడ ఏ పార్టీకి కూడా మెజారిటీ స్థానాలు రాలేదు. విజయ్ టీవీ కే పార్టీకి అధికంగా స్థానాలు వచ్చినప్పటికీ.. మ్యాజిక్ ఫిగర్ కు పది స్థానాల దూరంలో ఉంది. ఒకవేళ టీవీకేకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినప్పటికీ.. ఆ బలం సరిపోదు..

తమిళ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం విజయ్ పార్టీకి అన్నాడీఎంకే సపోర్ట్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అన్నా డీఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పటికీ విజయ్ కి సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అన్నా డీఎంకే నేత, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామితో టీవీకే నేత ఆనంద్ సమావేశమయ్యారు. ఇప్పటికే 35 మంది అన్నా డిఎంకె ఎమ్మెల్యేలు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ షణ్ముగం ను కలిసినట్టు వార్తలు వస్తున్నాయి. చెన్నైలో అత్యంత రహస్యంగా ఈ సమావేశం జరిగితే.. టీవీకేతో పొత్తు కచ్చితంగా కుదిరించాలని ఆయనను ఆ ఎమ్మెల్యేలు కోరినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పేటి తర్వాత టీవీ కి నేత ఆనంద్.. పలని స్వామి కలిశారు. ఇద్దరి మధ్య ఏం చర్చ జరిగిందనేది ఇంతవరకు బయటికి రాలేదు.

తమిళనాడు రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 234. ఇందులో 108 స్థానాలలో విజయ్ పార్టీ గెలిచింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ కి 118 ఎమ్మెల్యే స్థానాలు కావాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఐదు స్థానాల విజయం సాధించింది. అన్న డీఎంకే 47 స్థానాల్లో గెలిచింది. హస్తం పార్టీ సపోర్ట్ చేసినప్పటికీ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. అన్నా డీఎంకే ఎమ్మెల్యేలలో చాలామంది విజయ్ కి సపోర్ట్ చేయాలని అంటున్న నేపథ్యంలో పరిణామాలు ఎలాగైనా మారచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఐదు సీట్లు, సిపిఐ, సిపిఎం, విసికె నుంచి ఆరుగురు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఫలితంగా విజయ్ పార్టీ బలం 118 సీట్లకు పెరుగుతుంది. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం ఎమ్మెల్యే కామరాజు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఫలితంగా విజయ్ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్య 119కు చేరుకుంటుంది. అందువల్లే ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సహకరించాలని గవర్నర్ ను కోరారు దానికి ఆయన సమ్మతం తెలిపారు. ఇప్పటికే విజయ్ వీసీకే చీఫ్ కు ఒక లేఖ రాశారు. ఆ పార్టీకి ఎన్నికల్లో రెండు స్థానాలు వచ్చాయి. ప్రస్తుత అందుతున్న వార్తల ప్రకారం గురువారం విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. బుధవారం ఆయన గవర్నర్ ను కలిశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper