spot_img
HomeతెలంగాణDairy Milk Chocolate: పురుగులతో డైరీ మిల్క్.. విప్పి చూసి షాక్ అయ్యారు

Dairy Milk Chocolate: పురుగులతో డైరీ మిల్క్.. విప్పి చూసి షాక్ అయ్యారు

Dairy Milk Chocolate: కలిసొచ్చే కాలానికి.. నడిసొచ్చే కొడుకు పుడతాడో తెలియదు కానీ.. డైరీ మిల్క్ చాక్లెట్ లో మాత్రం పురుగు పుట్టుకొచ్చింది.. పాకురుకుంటూ ముందుకు సాగుతోంది. కొనుగోలు చేసి తిందామనుకున్న వ్యక్తికి షాక్ ఇచ్చింది. హైదరాబాదులో వెలుగు చూసింది ఈ ఘటన. సాధారణంగా డైరీ మిల్క్ చాక్లెట్స్ అంటే ఇష్టపడని వారు ఉండరు. ముఖ్యంగా పిల్లల గురించి చెప్పనక్కర్లేదు. లొట్టలేసుకొని తింటారు.అయితే అలా తిన్న సమయంలో ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. లేకుంటే మనం అనారోగ్యానికి గురికాక తప్పదు. హైదరాబాద్ చెందిన రాబిన్ జాకీస్ కు ఇదే అనుభవం ఎదురయ్యింది.

అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లోని ఓ దుకాణం నుంచి క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ ను రాబిన్ జాకీస్ కొనుగోలు చేశాడు. దానిని ఓపెన్ చేసినప్పుడు అందులో ఓ పురుగు కదులుతూ కనిపించింది. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ జాకీస్ ఓ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఒకసారి జాకీస్ పోస్టును పరిశీలిస్తే..’ అమీర్ పేట మెట్రో స్టేషన్ లోని రత్నదీప్ స్టోర్ లో క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ కొన్నా. తినేందుకు ఓపెన్ చేస్తే చాక్లెట్ లో ఒక పురుగు పాకుతున్నట్లు గుర్తించా. గడువు ముగియనున్న ఉత్పత్తుల విషయంలో నాణ్యత తనిఖీలు ఉండవా? ప్రజారోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు?’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్ పై పెను దుమారమే రేగుతోంది. నేటిజెన్లు విభిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.

దేశవ్యాప్తంగా రాబిన్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. దీంతో క్యాడ్బరీ డైరీ మిల్క్ సంస్థ స్పందించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. తమ సంస్థ నాణ్యత ప్రమాణాలు పాటిస్తుందని.. మీకుకలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని.. మీ పేరు, చిరునామా, కొనుగోలు వివరాలను పంపిస్తే.. సమగ్ర విచారణ చేస్తామని.. మీకు ధన్యవాదములు అంటూ సంస్థ ప్రతినిధులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఈ ఘటన దేశవ్యాప్తంగా సోషల్ మీడియాను కుదిపేసింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Venkatesh Kalyan Ram Movie

Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఎంజాయ్ చేస్తున్నారుగా…

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను చేస్తూ...
Bigg Boss Telugu

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ...

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్...
Nagarjuna

Nagarjuna: నాగార్జున కొడుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడా…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే...
Oktelugu Epaper