Allu Arjun’s Multiplex : హైదరాబాద్ లో ఈమధ్య ఏషియన్ సినిమాస్ సంస్థ స్టార్ హీరోలతో జతకట్టి మల్టిప్లెక్స్ థియేటర్స్ ని నిర్మిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతం లో AMB సినిమాస్ ని నిర్మించాడు.ఎంతో స్టైలిష్ మరియు లావిష్ మల్టిప్లెక్స్ అని పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ప్రముఖ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి మహబూబ్ నగర్ ప్రాంతం లో AVD సినిమాస్ ని స్థాపించారు.
ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి AAA సినిమాస్ ని స్థాపించారు. హైదరాబాద్ లోని అమీర్ పెట్ లో అత్యంత పాపులారిటీ ని సంపాదించుకున్న సత్యం థియేటర్ ని పడగొట్టి ఈ మల్టిప్లెక్స్ ని నిర్మించారు. నేడే ఈ మల్టిప్లెక్స్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ మల్టిప్లెక్స్ ని ప్రారంభించాడు, ఈ ప్రారంభోత్సవానికి అల్లు అర్జున్ మరియు అల్లు శిరీష్ కూడా హాజరయ్యారు.
ఇక ఈ మల్టిప్లెక్స్ థియేటర్ లో ఉన్న ప్రత్యేకతలు ఏమిటో ఒకసారి చూద్దాము. ఈ మల్టిప్లెక్స్ ని మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం లో కట్టారట. కేవలం పార్కింగ్ కోసమే రెండు ఫ్లోర్స్ ని కేటాయించినట్టు తెలుస్తుంది. ఈ మల్టిప్లెక్స్ లో మొత్తం 5 స్క్రీన్స్ ఉంటాయట. అందులో మొదటి స్క్రీన్ పొడవు ఏకంగా 72 అడుగులు ఉంటుందట. ఈ స్క్రీన్ లో బార్కో లేజర్ ప్రొజెక్షన్ ద్వారా సినిమాలను ప్రదర్శిస్తారట.ఇక రెండవ స్క్రీన్ ని EPIC లక్సన్ స్క్రీన్ గా పిలుస్తున్నారు. ఇది LED స్క్రీన్ అట. ముంబై లో తప్ప ఇండియా లో ఇలాంటి స్క్రీన్ ఎక్కడా లేదు. మన అల్లు అర్జున్ హైదరాబాద్ లో ఈ స్క్రీన్ ని పరిచయం చేస్తున్నాడు.
ఈ స్క్రీన్ కి ప్రొజెక్టర్ అవసరం లేదు, నేరుగా సాటిలైట్ కనెక్షన్ తో సినిమా ప్లే అవుతుంది. ఇక మిగిలిన మూడు స్క్రీన్స్ కూడా 4K లేజర్ తో ప్రొజెక్షన్ చెయ్యబడుతుందట. ఈ స్క్రీన్స్ అన్నిటికి డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టం అమర్చిబడి ఉంటుందట. ప్రేక్షకుడికి మర్చిపోలేని అనుభూతి, వచ్చిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ ఈ థియేటర్ కి వచ్చి అద్భుతమైన అనుభూతిని ఆస్వాదిస్తారట. ఆ రేంజ్ లో ఈ మల్టిప్లెక్స్ ని నిర్మించబడింది అని అంటున్నారు.