KTR reacts to Kavitha suspension: భారత రాష్ట్ర సమితి నుంచి ఆ పార్టీ శాసనమండలి సభ్యురాలు కవితను ఇటీవల సస్పెండ్ చేశారు. పార్టీకి వ్యతిరేకంగా ఆమె ధోరణి ఉందని చెబుతూ క్రమశిక్షణ ఉల్లంఘన కింద ఆ చర్య తీసుకున్నారు. వాస్తవానికి ఆస్థానంలో మరొక నాయకుడు లేదా నాయకురాలు ఉంటే మీడియాలో ఇంతగా చర్చ ఉండేది కాదు. ఆమె సాక్షాత్తు గులాబీ రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడి కుమార్తె కాబట్టి మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది . పైగా ఆమె సోదరుడు గులాబీ పార్టీకి కార్య నిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇంకా మిగతా స్థానాలలో ఆమె కుటుంబ సభ్యులకు ఉన్నారు. ఇలా ఎటు చూసుకున్నప్పటికీ ఆ పార్టీలో ఆమె కుటుంబ సభ్యులదే పెత్తనం. అలాంటి చోట ఆమె సస్పెండ్ కావడం ఒక రకంగా సంచలనం.
పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆమెపై విపరీతంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి . పార్టీలో ఉన్న వివిధ వర్గాలు ఆమెకు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమెపై ఊహించని దాడి జరుగుతోంది. మొదటిదాకా ఆమె గురించి పాజిటివ్ గా రకరకాల కోణాలలో మాట్లాడిన వారంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. కొందరైతే ఆమెతో కలిసి పనిచేయలేమని.. తమ అధిపతి కేసీఆర్ అని స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే కవితను ఒంటరి చేసే ప్రణాళిక అత్యంత విజయవంతంగా కొనసాగుతోందని అర్థమవుతుంది. ఇది ఎక్కడదాకా వెళ్తుంది.. ఎంత దాకా దారితీస్తుంది.. అనే ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు.
అది పార్టీ నిర్ణయం
కవిత సస్పెన్షన్ నిర్ణయంపై పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తొలిసారిగా స్పందించారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన కవిత విషయంలో స్పష్టత ఇచ్చారు. ఆమె సస్పెన్షన్ నిర్ణయం ఒకరు తీసుకున్నది కాదని.. పార్టీలో నిర్వహించిన తర్వాతే ఆ నిర్ణయం జరిగిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక మాట్లాడడానికి ఏమీ ఉండదని కేటీఆర్ పేర్కొన్నారు.. కవిత ప్రాథమికంగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన కవిత త్వరలో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. బడుగు బలహీన వర్గాల కోసం అండగా ఉంటారని.. ఆమె పార్టీ అజెండా కూడా అదేనని తెలుస్తోంది. సెప్టెంబర్ 17 లోపు ఆమె పార్టీకి సంబంధించిన విధి విధానాలు ఖరారు అవుతాయని.. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని కవిత వర్గీయులు అంటున్నారు.
ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ మీద కేటీఆర్ రియాక్షన్
కవితపై మా పార్టీ మాట్లాడి చర్యలు తీసుకుంది.. చర్యలు తీసుకున్నాక నేను మాట్లాడడానికి ఏమీ లేదు – కేటీఆర్ pic.twitter.com/snUJKebrFn
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2025